అమెరికా లో దుండగులు జరిపిన కాల్పుల్లో తెలంగాణ యువకుడు మృతి చెందాడు. ఖమ్మం నగరంలో రమణగుట్ట ప్రాంతానికిచెందిన నూకారపు కోటేశ్వరరావు కుమారుడు సాయి తేజ 4 నెలల క్రితం ఎమ్మెస్ చదవడానికి అమెరికా వెళ్లారు.
భారత కాలమాన ప్రకారం శుక్రవారం రాత్రి ఒంటిగంటకు షాపింగ్ మాల్స్ లో స్టోర్ మేనేజర్ గా పనిచేస్తున్న సాయి తేజ పై ఇద్దరూ గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కాల్పులు జరిపి క్యాష్ కౌంటర్ లోని నగదుతో పారిపోయారుశుక్రవారం లేదా శనివారం నాడు అతని భౌతిక కాయం ఖమ్మం నగరానికి వచ్చే అవకాశం ఉంది. ఈ సంఘటన చికాకో లో జరిగింది
