HomeCRIMEమాయం అవుతున్న గుట్టలు ....నగర శివారు లోనే యథేచ్ఛగా మొరం తవ్వకాలు ......అక్రమ దందా...

మాయం అవుతున్న గుట్టలు ….నగర శివారు లోనే యథేచ్ఛగా మొరం తవ్వకాలు ……అక్రమ దందా కు అధికార పార్టీ ముద్ర

అధికార పార్టీ అండ తో మరోసారి మొరం అక్రమ దందా కు తెరలేచింది.అనుమతుల ముసుగులో గుట్టలనే మాయం చేస్తున్నారు. మామూళ్ల యావ లో పడి అధికారులు సైతం చూసి చూడనీ ధోరణి తో వుంటున్నారు.కలెక్టర్ తో సహా ముఖ్య అధికారులుండే జిల్లా కేంద్రానికి కొద్దీ దూరంలోని ఈ దందా యథేచ్ఛగా సాగుతుండడం గమనార్హం.

అంతే కాదు కలెక్టర్ యింటి ముందు నుంచే మొరం అక్రమ రవాణా సాగుతున్న సరే పట్టించుకునే నాధుడే లేకుండా పోయారు. నిజామాబాద్ నగర శివారు ప్రాంతాల్లో నే మొరం దందా సాగుతుంది.

మొన్నటి దాక గుండారం, మాణిక్ బండారు, మల్లారం, ముదక్ పల్లి ల ప్రాంతాల్లో గుట్టలను తవ్వేసిన మొరం దందా సాగించారు.కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చాక కొద్దీ రోజులు ఈ గుట్టల్లో మొరం తవ్వకాలు ఆగిపోయాయి. కానీ మల్లారం శివారు మాత్రం యదేచ్చగాసాగుతుంది.

అధికార పార్టీ కి చెందిన ఓ చోటా లీడర్ ను ప్రోత్సహం తో పాత గుత్తేదారు మల్లారం గుట్టగా యదేచ్చగా తవ్వేస్తున్నారు.గత పదేళ్లుగా నగరానికి చెందిన బిఆర్ యస్ కు చెందిన ఓ ప్రజాప్రతినిధి ఇక్కడే అడ్డా వేసి మరీ మొరం తవ్వకాలు చేయించారు.

కానీ బిఆర్ యస్ అధికారం కోల్పోయాక సదురు నేత తెరచాటుకు వెళ్లిపోగా ఇప్పుడు ఓ కాంగ్రెస్ ముద్ర ఉన్న మరో నేత హడావుడి చేస్తున్నారు. ఆ పార్టీ అధికారంలో వుంటే ఏందీ మొరం తవ్వకాలు యదేచ్చగా సాగుతున్నాయా లేదా ? మల్లారం గుట్ట నగరానికి కేవలం అయిదు కిలో మీటర్ల దూరంలోనే ఉన్నా సరే గుట్ట చుట్టూ భారీ యంత్రాలు రాత్రిబవళ్ళు తవ్వలేస్తున్న యంత్రాంగం కన్నెత్తి చూడలేక పోతుంది.

మల్లారం గుట్ట నుంచి ఓవర్ లోడ్ తో వచ్చే మొరం వాహనాలు కలెక్టర్ ఇంటి ముందు నుంచే నగరంలోకి ఎంట్రీ అవుతున్నాయి. వయా వర్ని చౌరస్తా నగరంలో ఆయా ప్రాంతాలకు తరలిస్తున్నారు.

అన్నీ అనుమతులతోనే మొరం తవ్వకాలు సాగిస్తున్నామని గుత్తేదారు చెప్తున్నారు అయితే చేసే దందా లీగల్ అయితే రాత్రి పది నుంచి తెల్లవారు జామున దాక ఎందుకు రవాణా చేస్తున్నారనేది ఆసక్తిగా మారింది.

రాత్రి పది గంటలకు పది టిప్పర్ల వాహనాలు మల్లారం నుంచిఓవర్ లోడ్ వస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో డంప్ చేస్తున్నారు ఒక్కో టిప్పర్ కనీసం మూడు ట్రిప్ లు రవాణా అవుతున్నాయి.

రవాణా రెవెన్యూ మైన్స్ అధికారులే కాదు రాత్రంతా నగరంలో సైరెన్ల మోగిస్తూ పెట్రోలింగ్ చేసే పోలీసులు సైతం ఈ వాహనాల విషయంలో ఎందుకు లైట్ తీసుకుంటున్నారు .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments