HomeCRIMEమొరం దందా కు వాటాల మంత్రం …..రెవెన్యూ.. పొలీస్ అధికారుల డీల్ అయ్యాకే దందా ?...

మొరం దందా కు వాటాల మంత్రం …..రెవెన్యూ.. పొలీస్ అధికారుల డీల్ అయ్యాకే దందా ? రాత్రి వేళలో నే రవాణా

ఓ ఎకరం భూమి అన్యాక్రాంతం అయితేనే శివాలెత్తిపోతున్న రెవెన్యూ యంత్రాంగం ప్రభుత్వ ఖజానా ను కొల్లగొడుతూ గుట్టలను తవ్వేసి మొరం దందా సాగిస్తున్న వారికి విషయంలో ఎందుకు మెతక వైఖరి తో ఉంటున్నారనేది సర్వత్రా చర్చనీయాంశం అయింది సరే అదేదో మారుమూల ప్రాంతాల్లో ఈ దందా సాగుందనుకుంటే సరే లే అని సరి పెట్టుకోవచ్చు .

కానీ మొరం తవ్వకాలు సాగుతున్న గుట్ట జిల్లా కేంద్రంకు అతి సమీపంలోనే కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ కు జస్ట్ రెండు కిలో మీటర్ల దూరంలోనే అదికాదు కలెక్టర్ ముందు నుంచే మొరం టిప్పర్ల రాత్రంతా రయ్యున దూసుకెళ్తున్నాయి.

ఇటీవల నందిపేట్ మండల లో ఓ ప్రభుత్వ భూమి విషయంలో నేరుగా కలెక్టర్ రంగంలోకి కఠిన చర్యల కోసం పోలీసును పురమాయించారు వారు తమ మార్క్ ప్రతాపం చూపెట్టారు. వామ్మో యంత్రాంగం ఎంత గట్టిగా పనిచేస్తున్నారని బిల్డప్ ఇచ్చేసారు.

మరీ అలాంటి కఠిన చర్యలు జిల్లా కేంద్రంలోనే యదేచ్చగా సాగుతున్న మొరం దందా ఫై ఎందుకు కొరఢా ఝుళిపించలేక పోతున్నారు. మొక్కబడి గా అనుమతులు పొందుతూ ఆ ముసుగులో గుట్టలనే మాయం చేస్తున్నారు. తవ్వకాలు మొదలవ్వక ముందే రెవెన్యూ పోలీస్ అధికారులతో డీల్ సెట్ సెట్ చేసుకోవడం అనివార్యం.

జస్ట్ టిప్పర్ గుట్ట దాటిందే ఆలస్యం రెవెన్యూ డేగలు ఎంట్రీ ఇస్తాయి. అందుకే గుత్తేదార్లు ముందే మామూళ్ల మాట్లాడుకొని పక్క కార్యాచరణ తో రంగంలోకి దిగుతారు.అధికార పార్టీ కి చెందిన ఓ చోటా లీడర్ ను ప్రోత్సహం తో ఓ పాత గుత్తేదారు మల్లారం గుట్టగా యదేచ్చగా తవ్వేస్తున్నారు.

గత పదేళ్లుగా నగరానికి చెందిన బిఆర్ యస్ కు చెందిన
ఓ ప్రజాప్రతినిధి ఇక్కడే అడ్డా వేసి మరీ మొరం తవ్వకాలు చేయించారు. కానీ బిఆర్ యస్ అధికారం కోల్పోయాక సదురు నేత తెరచాటుకు వెళ్లిపోగా ఇప్పుడు ఓ కాంగ్రెస్ ముద్ర ఉన్న మరో నేత తెరమీదికి వచ్చేసారు గుట్ట చుట్టూ భారీ యంత్రాలు రాత్రిబవళ్ళు తవ్వలేస్తున్న యంత్రాంగం కన్నెత్తి చూడలేక పోతుంది.

మల్లారం గుట్ట నుంచి ఓవర్ లోడ్ తో వచ్చే మొరం వాహనాలు కలెక్టర్ ఇంటి ముందు నుంచే నగరంలోకి ఎంట్రీ అవుతున్నాయి. వయా వర్ని చౌరస్తా నగరంలో ఆయా ప్రాంతాలకు తరలిస్తున్నారు.అన్నీ అనుమతులతోనే మొరం తవ్వకాలు సాగిస్తున్నామని గుత్తేదారు చెప్తున్నారు అయితే చేసే దందా లీగల్ అయితే రాత్రి పది నుంచి తెల్లవారు జామున దాక ఎందుకు రవాణా చేస్తున్నారనేది ఆసక్తిగా మారింది.

రాత్రి పది గంటలకు పది టిప్పర్ల వాహనాలు మల్లారం నుంచిఓవర్ లోడ్ వస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో డంప్ చేస్తున్నారు ఒక్కో టిప్పర్ కనీసం మూడు ట్రిప్ లు రవాణా అవుతున్నాయి.

రెవెన్యూ అధికారులు గంప గుత్తగా మామూళ్లు సెట్ చేసుకోగా పోలీసులు మాత్రం టిప్పర్ లెక్కన డీల్ సెట్ చేసుకున్నారు.ఏ స్థాయి అధికారులకు ఎంత మేరకు వాటాలున్నాయనేది బయటికి పొక్కనీయడం లేదు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments