HomeCRIMEవేధింపులు తాళలేక ఫార్మాసిస్టు ఆత్మ హత్య .....

వేధింపులు తాళలేక ఫార్మాసిస్టు ఆత్మ హత్య …..

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని భూపుత్రమ్మ కల్యాణ మండపం ఆవరణలోని షెడ్డులో బీడీ వర్కర్స్ కాలనీకి చెందిన శిరీష (28) అనే ఫార్మసిస్ట్ ఉరి వెసుకొని అత్మహత్య చేసుకుంది.

శిరీష ఉద్యోగానికి సంబంధించిన విషయంలో వేధింపులు ఎదురవుతున్నాయని మనస్తాపంతో అత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శిరీష బి ఫార్మసీ పూర్తి చేసి కాంట్రాక్ట్ ప్రాతిపదికన జిల్లా వైద్యారోగ్య శాఖ పరిధిలోని ఆర్బీఎసీ కే విభాగంలో ఫార్మసిస్ట్ గా కొంతకాలంగా బిచ్కుందలో పనిచే స్తోంది.

శిరీష భర్త స్వామి బతుకు తెరువు కోసం కొద్ది రోజుల క్రితం దుబాయికి వెళ్లగా, మామ పోచయ్య, అత్త సుగుణ లు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని భూపుత్రమ్మ కల్యాణ మండపంలో వాచ్మెన్లుగా పనిచేస్తున్నారు. వారికి అక్కడే కేటాయించిన ఓ గదిలో అందరూ కలిసి ఉంటున్నారు.

గత కొంతకాలంగా శిరీషను కొందరు వ్యక్తులు వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలిసింది. ఉద్యోగానికి సంబంధించిన విషయంలో వేధింపులు ఎదురవుతున్నాయని, ఉన్న తాధికారుల దృష్టికి సైతం ఈ విషయాన్ని తీసుకువెళ్లినట్లు సమాచారం.

బుధవారం మధ్యాహ్నం కలెక్టరేట్లో నిర్వహించిన శాఖపరమైన సమావేశానికి కూడా శిరీష హాజరైంది. సాయంత్రం ఇంటికి వచ్చిన శిరీష రాత్రి 7 గంటల ప్రాంతంలో ఇంటికి పక్కనే ఉన్న ఓ చిన్న షెడ్డులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు గమనించారు.

ఘటనా స్థలాన్ని పట్టణ పోలీసులు పరిశీలించి విచారణ చేపట్టారు. మృ తురాలికి ఐదేళ్ల లోపు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ఘటనపై పట్టణ పోలీసులు విచారణ జరుపుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments