ఉత్తమ సేవలు అందించిన హోంగార్డులకు ప్రశంసపత్రాలు అందజేశారు. శుక్రవారం హోంగార్డు సంస్థ 75వ రైజింగ్ డే సందర్భంగా సీపీ కార్యాలయంలో అదనపు సీపీ(అడ్మిన్) కోటేశ్వరరావు ఐదుగురు హోంగార్డులకు ప్రశంసాపత్రాలు అంజేసి సన్మానించారు.
అందులో స్వామి(ఆర్మూర్), పోతన్న(బోధన్ రూరల్), జీవన్ సింగ్(ట్రాఫిక్ పీఎస్), రఘువీర్(నిజామాబాద్ 3వ టౌన్), షేక్ ఖాజా(ఏపీసీ కార్యాలయం)ను అభినందించారు. కార్యక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్(ఏఆర్) శంకర్ నాయక్, సతీశ్, తిరుపతి, సీఐ వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
