డ్రంకన్ డ్రైవ్ కేసులో జిల్లా మెజిస్ట్రేట్ ముగ్గురికి జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని బస్టాండ్,నిఖిల్ సాయి చౌరస్తా వద్ద డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా..
రాథోడ్ మోతీలాల్, అనిల్, సాగర్ మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వీరిని శుక్రవారం జిల్లా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా మెజిస్ట్రేట్ అహ్మద్ మొయిద్దీన్ రాథోడ్ మోతీలాల్ కి వారం రోజులు, అనిల్, సాగర్ లకు మూడురోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు.
