HomePOLITICAL NEWSఅధికార పార్టీలో చిచ్చురేపిన జూపల్లి టూర్ ...........మంత్రి వస్తున్నారని కాంగ్రెస్ నేతల ముందస్తు అరెస్టు లు...

అధికార పార్టీలో చిచ్చురేపిన జూపల్లి టూర్ ………..మంత్రి వస్తున్నారని కాంగ్రెస్ నేతల ముందస్తు అరెస్టు లు ……జుక్కల్ నియోజక వర్గంలో ఉద్రిక్తంగా అధికార పనులు

ఎవరైనా అధికార పార్టీ ప్రముఖులు వస్తే ఎలాంటి ఆందోళనలు నిరసన లాంటి కార్యక్రమాలు జరగకుండా ప్రతిపక్ష నేతలను ఒకరోజు ముందు అదుపులోకి తీసుకొని వారందరిని సమీప ఠాణా ల్లో నిర్బంధిస్తారు.పోలీసులకు ఇదో ఆనవాయితీ పక్రియ గా మారింది.

నిజానికి ఇలాంటి ఆసాధారణ ముందస్తు అరెస్టు లనేది సీఎం ఆస్థాయి ప్రముఖల పర్యటనలోనే ఉండేది . జుక్కల్ లో పోలీసులకు విచిత్ర పరిస్థితి తలెత్తింది.ఓ మంత్రి వస్తుంటే అదికూడా ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి వస్తుంటే ఆ ప్రాంతంలో ఉండే కీలక కాంగ్రెస్ నాయకులను ముందస్తుగా గానే లొపేయాలంటూ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో స్థానిక పోలీసులకు కంగు తిన్నారు.

ఏముంది ఆదేశాలు పై నుంచి కదా కక్కా లేక మింగలేక అన్నట్లుగా లిస్టు లో ఉన్న నేతలను మూకుమ్మడిగా తెచ్చి లోపలేశారు ఎలాంటి విడ్డురం ఎక్కడో కాదు జుక్కల్ లో జరిగింది.

నిన్నటి దాక తమకు మర్యాద ఇచ్చిన పోలీసులు ఉదయమే ఇండ్లలోకి చొరబడి కఠినంగా వుండడం చూసి రగిలి పోయారు. జుక్కల్ ఎమ్మెల్యే అధికార పార్టీ కి చెందిన లక్ష్మి కాంతా రావు ఉన్నారు అయినప్పటికి ఇదేమి వైపరీత్యం అంటారా ? అదేం లేదు అసెగ్మెంట్ లో ఎమ్మెల్యే తీరుతో మెజార్టీ కాంగ్రెస్ నేతలు నిరసన గళం ఎత్తారు.

నేరుగా గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ ను కలిసి మొరపెట్టుకున్నారు ఈ నేపథ్యంలోనే శనివారం జుక్కల్ నియోజక వర్గంలోని పలు అభివృద్ధి పనులకు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణ రావు భూమి పూజ చేయడానికి వచ్చారు . ఈ నేపథ్యంలో జుక్కల్ నియోజక వర్గంలోని జుక్కల్, మద్నూర్, బిచ్కుంద, నిజాంసాగర్, పెద్ద కోడప్గల్ మండలాలకు చెందిన పలువురు రెబల్ కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

జుక్కల్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీలో నెలకొని ఉన్న అంతర్గత కుమ్ములాటలపై , ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడలపై మంత్రికి పిర్యాదు చేస్తారనే ముందస్తు సమాచారం మేరకు మంత్రి పర్యటన ముగించెంత వరకు రెబల్ కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ లలో నిర్బంధించారు.

ఇదిలా ఉండగా నిర్బంధంలో ఉన్న రెబల్ కాంగ్రెస్ నాయకులు సొంత పార్టీలో పోలీసులతో తమ గొంతు నొక్కడం సరియైన విధానం కాదంటూ నిరసన వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments