నగరంలో వ్యక్తి దారుణ హత్య..నగరంలో వ్యక్తినీ దారుణంగా హత్య చేసిన ఘటన వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్లితే.. నగరంలోని మిర్చి కాంపౌండ్ ప్రాంతంలోని దర్గా సమీపంలో ఉండే ట్రాన్స్ పోర్ట్ దుకాణం వద్ద శనివారం రాత్రి ముగ్గురు వ్యక్తులు నిద్రించారు.
కాగా.. షాపు నిర్వాహకుడు ఉదయం వచ్చి చూసేసరికి ఓ వ్యక్తిని గొంతుకోసి హతమార్చినట్లు గుర్తించాడు. దీంతో సదరు వ్యక్తి స్థానిక ఒకటవ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సీఐ రఘుపతి, ఎస్సై మొగులయ్య ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
డాగ్ స్క్వాడ్‌తో పాటు క్లూస్ టీం వచ్చి ఆధారాలు సేకరించారు. మృతునితో కలిసి నిద్రించిన ఇద్దరు వ్యక్తులను అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
