ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పర్యటించనున్నారు.
తొలుత కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టుకు చేరుకొని, స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావుతో కలిసి ప్రాజెక్టు ఆయకట్టుకు ప్రధాన కాలువ ద్వారా నీటి విడుదలను ప్రారంభించనున్నారు.
అనంతరం నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు చేరుకొని అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
