విభేదాలు పక్కకు పెట్టి సమిష్టిగాపనిచేయాలనీ సాక్షాత్తు ప్రధాని మోడీ చేసిన హితబోధ కూడా తెలంగాణ బీజేపీ నేతల చెవిక్కించుకోవడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి ఎవరనే విషయంలో ఎంపీ ల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు కేంద్ర మంత్రి వర్సెస్ ఎంపీ లన్నట్లుగా సాగుతున్నది.
ముగ్గురు సభ్యులతో ఏర్పాటైన కమిటీ సైతం ఎటు తేల్చలేక బంతి ఢిల్లీ పెద్దల కోర్టు లోకి నెట్టేసి చేతులు దులుపు కుంది. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానంగా ఉన్న నిజామాబాద్ పట్టభద్ర నియోజకవర్గం లో కాషాయ జెండా ఎగరేస్తామని బీరాలు పలుకుతున్న కమలనాధులు అభ్యర్థి విషయంలోనే ఆపసోపాలు పడుతున్నారు.
కాంగ్రెస్ కు చెందిన జీవన్ రెడ్డి మొన్నటిదాకా ఎమ్మెల్సీ గా ఉన్నారు. ఆయన పదవీ కాలం పూర్తిఅయింది. కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి నే మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికలో బరిలోకి దించే ఆలోచనలో ఉంది. కానీ ఎంపీ ఎన్నికల్లోనే నిజామాబాద్ నుంచి పోటీ చేస్తే సీనియర్ నేతలెవ్వరూ పట్టించుకోలేదు.
అందుకే ఈ నియోజకవర్గం ను కైవసం చేసుకునే ఎత్తుగడ కు బీజేపీ వ్యూహరచన చేస్తుంది. పక్క ప్రణాళిక తో కదిలితే గెలుపు నల్లేరు మీద నడకే ననే భావన బీజేపీ పెద్దల్లో ఉంది. ఎలాగో మోడీ గట్టిగా క్లాస్ పీకి పంపారు.
ఆయన దిశానిర్దేశం మేరకైనా కమలనాధులు కలిసి కట్టుగా పనిచేస్తారని భావిస్తున్నారు. ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధి నాలుగు ఉమ్మడి జిల్లాల్లో విస్తరించి ఉంది. కరీం నగర్ ,నిజామాబాద్ ,ఆదిలాబాద్ ,మెదక్ .లున్నాయి.
నాలుగు జిల్లాలోనూ బీజేపీ కి చెందిన ఎంపీ లే ఉన్నారు. ఆదిలాబాద్ మినహా మిగితా ముగ్గురు ఎంపీ లు బీజేపీ దిగ్గజ నేతలే ఖ్యాతి పొందిన వారే. .అందుకే అభ్యర్థి విషయంలోనే రగడ మొదలయ్యింది ఎవరూ తగ్గేదే లేదు అన్నట్లుగా ఉన్నారు. ఎన్నికల పక్రియ సంగతి ఎలా ఉన్న అభ్యర్థి ఎంపికే అత్యంత క్లిష్టంగా భావిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలు నాలుగే అయినా ప్రస్తుతం 13 జిల్లాలున్నాయి. అధిష్టానం ముగ్గురు సీనియర్ నేతల తో ఓ కమిటీ ని వేసింది. అభ్యర్థి ఎవరనేది ప్రతిపాదించే కార్యం కమిటీ మీదే వేసింది. సో ఈపాటికే రంగంలోకి దిగిన కమిటీ ఎంపీ ఎమ్మెల్యే లు జిల్లా అధ్యక్షులు పార్టీ కేంద్ర రాష్ట్ర నేతల అభిప్రాయాలను తెలుసుకుంది.
ముఖ్యంగా ఎంపీ సూచించిన అభ్యర్థుల విషయంలోనే ఈ కమిటీ ఎక్కువగా ఫోకస్ చేసింది.కానీ ఇక్కడే అసలు చిక్కు వచ్చింది ఆదిలాబాద్ ఎంపీ నగేష్ నిజాంబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మెదక్ ఎంపీ రఘునందన్ రావు లు ఒకే మాటగా మంచిర్యాల్ జిల్లా అధ్యక్షుడు రఘునంద రావు పేరు ప్రతిపాదించారు.
ఆయా జిల్లాల అధ్యక్షులు సైతం ఆయన పేరు బలపరిచారు. కానీ కరీంనగర్ ఎంపీ కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ మాత్రం రివర్స్ గేర్ వేశారు. ఆయన మెదక్ జిల్లా అధ్యక్షురాలు గోదావరి భర్త అంజిరెడ్డి పేరు అనూహ్యంగా తెరమీదికి తెచ్చారు. సంజయ్ చెప్తున్న అంజిరెడ్డి అభ్యర్థి గా ఖరారు చేయద్దని ముగ్గురు ఎంపీ లు పట్టుబడుతున్నారు.
తన జిల్లాకు చెందిన నేత ను ఎమ్మెల్సీ టికెట్ రేసులోకి తేవడం ఫై మెదక్ ఎంపీ రఘునందన్ రావు గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థి ఎంపికలో ఢిల్లీ పెద్దలు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తిగా మారింది
