పుష్పా 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ను అరెస్ట్ చేసారు టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆయన నివాసం వద్దకు చేరుకొని పోలీస్ స్టేషన్‌కు రావాలని అడిగారు.
వారికి సహకరించిన అర్జున్ వారితో పాటు వెళ్లారు. ఆయన వెంటనే అల్లు అరవింద్ కూడా వెళ్లాలని చూడగా పోలీసులు వద్దని సూచించారు. ఈక్రమంలోనే ఆందోళనలో ఉన్న తన భార్య స్నేహారెడ్డికి అర్జున్ ధైర్యం చెప్పి వెళ్లిపోయారు. తొక్కిసలాట ఘటనలో రేవతి మృతి చెందడంతో పోలీసులు అల్లు అర్జున్‌పై 105, 118(1), రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. .
ఈ కేసు రుజువైతే అర్జున్‌కు సుమారు పదేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉందని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో సంధ్య థియేటర్ ఓనర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
భారీగా తరలి వస్తున్న అభిమానులు
అల్లుఅర్జున్ అరెస్ట్ సోషియల్ మీద రావడంతో ఆయన అభిమానులు చిక్కడపల్లి స్టేషన్ కు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆయన ను అరెస్ట్ జైలు కు తరలించడానికి ముందు ఉస్మానియా ఆసుపత్రి లో వైద్య పరీక్షలు సైతం నిర్వహించారు.
హైకోర్టు లో అత్యవసర పిటిషన్
తొక్కిస లాట కేసులో అరెస్ట్ అయినా అల్లు అర్జున్ హైకోర్టు ను ఆశ్రయించారు. ఆయన తరుపున నిరంజన్ రెడ్డి అత్యవస పిటిషన్ వేశారు. నిర్ణిత సమయానికి పిటిషన్ బెంచ్ ముందుకు రాకపోవడంతో పిటిషన్ ఫై విచారణను సోమవారం కు వాయిదా వేశారు
