విధి నిర్వహణలో ఉండగా దొరికిన బ్యాగును బాధితులకు అందజేసి రైల్వే పోలీసులు నిజాయితీ చాటుకున్నారు. రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం రైల్వే ప్లాట్ఫా మ్ పైన పోలీసులు తనిఖీ చేస్తుండగా పక్కన ఓ బ్యాక్ కనిపించినట్లు తెలిపారు.
ఆ బ్యాగును చూసిన పోలీసులు కొద్ది సమయం అక్కడ ఉన్న స్థానికులకు అడగగా ఎవ్వరూ రాలేదు. ఆ బ్యాగును రైల్వే పోలీస్ స్టేషన్ కు తరలించగా అందులో ఈ వస్తువులను తనిఖీ చేశారు. ఆ బ్యాగులో లక్ష 85000 రూపాయలు మరియు రెండు తులాల బంగారం చైను,సెల్ ఫోన్ ఏటీఎం కార్డు ఉన్నట్టు పేర్కొన్నారు.
ఏటీఎం కార్డు ద్వారా వివరాలు సేకరించారు. జగిత్యాలకు చెందిన నరసయ్య ముంబై నుంచి నిజామాబాద్ రాగా ఆ బ్యాగ్ నూ రైల్వే స్టేషన్ లో మరిచి ఇంటికి వెళ్ళిపోయినట్లు పేర్కొన్నారు.
వెంటనే బాధితులకు ఫోన్ చేసి నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో అతి బ్యాగును బాధ్యత కుటుంబ సభ్యులకు అందజేసినట్లు ఎస్సై సాయి రెడ్డి పేర్కొన్నారు.
అట్టి బ్యాగును అందజేయడంలో హెడ్ కానిస్టేబుల్ కుబేరుడు, కానిస్టేబుల్ బుల్ ఆర్పిఎఫ్ కానిస్ హెడ్ కానిస్టేబుల్ పాషా లను ప్రత్యేకంగా అభినందించినట్లు పేర్కొన్నారు.
