మలుపుల వద్ద రోడ్డుకు ఇరువైపులా గుబురుగా పెరిగిన చెట్లు, కొమ్మలు, ముళ్లకంపలతో ప్రమాదాలు జరుగకుండా నిరోధించేందుకు నిజామాబాద్ రూరల్ ఎస్ఐ ఎండి ఆరీఫ్ ట్రాక్టర్ తెప్పించి రోడ్డులో అడ్డుగా ఉన్న చెట్లు, కొమ్మలు, ముళ్లకంపలను తొలగింపజేశారు.
ఈసందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మల్లారం గండి లోని రోడ్డుకు అడ్డంగా చెట్ల కొమ్మలు పెరగడం వల్ల పలు సందర్భాల్లో వాహనదారులు ప్రమాదాల బారిన పడ్డారన్నారు.
కాగా రోడ్డుకు ఇరువైపులా గుబురుగా పెరిగిన చెట్లు, కొమ్మలు, ముళ్లకంపలను తోగించినట్లు పేర్కొన్నారు ఎస్ఐ పనితీరును పలువురు ప్రశంసించారు.
