HomeCRIMEలోక్ అదాలత్ లో సైబర్ క్రైమ్ కేసులపరిష్కారం ....రాష్ట్రస్థాయిలో నిజామాబాద్ జిల్లాకు 5వ స్థానం...

లోక్ అదాలత్ లో సైబర్ క్రైమ్ కేసులపరిష్కారం ….రాష్ట్రస్థాయిలో నిజామాబాద్ జిల్లాకు 5వ స్థానం : ఇంచార్జీ పోలీస్ కమీషనర్ వెల్లడి

లోక్ అదాలత్ లో సైబర్ క్రైమ్ కేసులను పరిష్కరించడంలో నిజామాబాద్ అయిదో స్థానం లో నిలిచింది.ఈ మేరకు ఇంచార్జ్ కమిషనర్ సింధు శర్మ వివరాలు వెల్లడించారు. గత కొంత కాలంగా పరిష్కారం కాకుండా కోర్టులలో మరియు బ్యాంక్ లలో అపరిస్కృతంగా ఉన్నాయి.

ఇలాంటి *174 కేసులలో మొత్తం రూ 71,52లక్షలు లను ఇప్పించడానికి ఈ నెల 14న నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో ఈ కేసుల పరిష్కరించడానికి ప్రాధాన్యత గా తీసుకున్నారు. సైబర్ నేరస్తుల నుంచి రికవరీ చేసి వివిధ బ్యాంక్ లలో హోల్డ్ అయి న డబ్బులను జాతీయ లోక్ అదాలత్ ద్వారా బాధితులకు వాపసు ఇప్పించేలా ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది.

25వేల కన్నా ఎక్కువ నష్టపోయిన 131 కేసులలో రూపాయలు 67,00221-00. 25 వేల కన్నా తక్కువ నష్టపోయిన 43 కేసులలో రూపాయలు 4,52,284-00*కోర్టులో ఫైల్ చేసినసైబర్ నేరాల 174 కేసులలో రూపాయలు 71,52,505-00*బాధితులకు అందనున్నాయి .

లోక అదాలత్ ల్లో సైబర్ నేరాల బాధితులకు నగదు వాపసు ఇప్పించడం లో నిజామాబాద్ జిల్లాకు అయిదో స్థానం నిలిచిందన్నారు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఫిర్యాదు దారులకు పోలీసుల యొక్క కృషి వలన వివిధ బ్యాంకులలో హోల్డ్ అయిన బాధితుల డబ్బులను ఇప్పించడం కోసం ఎలాంటి ఆటంకాలు లేకుండా తగు చర్యలు తీసుకుని జాతీయ లోక్ అదాలత్ ద్వారా వివిధ రకాల సైబర్ నేరాలలో మోసపోయిన బాధితులకు న్యాయం దక్కిందన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments