మాజీ సర్పంచ్ ల మీద పోలీసులు డేగ కన్ను వేశారు.ఆయా గ్రామాల్లో వారి కదలికల మీద ఓ కన్నేసి పెట్టారు. ఆందోళన లో పాల్గొనకుండా ముందస్తుగా అరెస్టు లు చేస్తూన్నారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మాజీ లెవ్వరు హైదారాబాద్ వెళ్లకుండ వారిని కట్టిడి చేయడానికే పోలీసులు రంగంలోకి దిగారు.
మాజీ లు సోమవారం హైదారాబాద్ వెళ్లే అవకాశం ఉన్నట్టు ఇంటలిజెన్స్ వర్గాలు అప్రమత్తం చేయడంతో పోలీసు లు రంగంలోకి దిగారు ఉమ్మడి జిల్లాలో ఆయా గ్రామాల్లో మాజీ సర్పంచ్ లను ముందస్తుగా అదుపులోకి తీసుకోని తెల్లవారు జామున నుంచే సమీప పోలీస్ స్టేషన్ లకు తరలించారు.
అభివృద్ధి పనులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న బిల్లులు క్లియర్ చేయాలని డిమాండ్ గ్రామాలలో మాజీ సర్పంచ్ లు అభివృద్ధి పనుల పేరిట ఖర్చు చేసిన బిల్లులను రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించమంటూ విన్నపాలు చేస్తుంటే ప్రభుత్వ మాత్రం చెల్లించకుండా అర్ధరాత్రి సమయాలలో మాజీ సర్పంచ్ లను అరెస్టు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని మాజీ సర్పంచ్ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో బోధన్ రూరల్ పోలీసులు సోమవారం బోధన్,సాలురా మండలాలకు చెందిన తాజా మాజీ సర్పంచ్ లను 2 గంటల రాత్రి అరెస్టు చేసి ఠాణాకు తరలించారు.మాజీ సర్పంచ్ లను అర్ధరాత్రి అరెస్టు చేసి ఠాణాకు తరలించడంతో వారు పోలీస్ స్టేషన్ లో చలి మంటలు కాసుకుంటూ కాలక్షేపం చేయాల్సి వచ్చింది .
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో అప్పులు చేసి గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి నచ్చినట్లుగా లేదని విమర్శలు చేశారు.అభివృద్ధే ద్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను సాగిస్తున్నట్లయితే మాజీ సర్పంచ్ లకు చెల్లించవలసిన బకాయి బిల్లులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెనుకాడబోమని హెచ్చరించారు.సీఎం రేవంత్ రెడ్డి,బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
బిల్లుల చెల్లింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యం పాలన వైఫల్యానికి నిదర్శనంగా భావించవలసి వస్తుందని ఎద్దేవా చేశారు.అరెస్ట్ అయిన వారిలో సిర్ప సుదర్శన్,కొర్వ గంగాధర్,చింతం నాగయ్య,మందర్న గంగాధర్ తదితరులున్నారు
