న్యాయమైన డిమాండ్ ల సాధన కోసం ఆటో డ్రైవర్లు ఆందోళన బాట పెట్టబోతున్నారు. ఈమేరకు యూనియన్ నేతలు యం ఏ సలీమ్ ,బి వెంకటేశం ,విమారయ్య ,సతీష్ రెడ్,డి ప్రవీణ్ ,శ్రీకాంత్ గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
శుక్రవారం ఛలో అసెంబ్లీ తలపెట్టామని తాము ఆటో లతో వచ్చి అసెంబ్లీ ముందు బైఠాయిస్తామని ప్రభుత్వం తమపై ఎలాంటి కేసులైన పెట్టుకోవచ్చన్నారు. కానీ తాము జీవనం సాగించలేని దుస్థితి లో ఉన్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తమకు ఆర్థిక సహాయం చేయాలని వారు కోరారు .
తమ న్యాయమైన సమస్య ల పరిష్కారానికి ఈ నెల 7 న సార్వత్రిక సమ్మె చేయడానికి సిద్ధం అయ్యామని కానీ 6 న రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ వచ్చి ఎమ్మెల్సీ కోదండరాం ఎమ్మెల్యే సాంబశివరావు సమక్షంలో ఆటో డ్రైవర్ల సమస్యలమీద సచివాలయంలో చర్చిస్తామని మాట ఇచ్చారని మరుసటి రోజు మంత్రి ఇంటికి సైతం వెళ్లి చర్చలు జరిపామని ఈ నెల 10 11 తేదీల్లో ఆటో యూనియన్ నేతలతో భేటీ జరిపి సమస్యల పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారని వారు గుర్తు చేసారు. ఇప్పటిదాకా మంత్రి నుంచి ఎలాంటి స్పందన లేదని వారు ఆవేదన వ్యక్తం చేసారు గత్యంతరం లేకనే తాము ఆందోళన సిద్ధం అవుతున్నామన్నారు.
