HomeLaw and Orderఅంబులెన్సులో కలెక్టరేట్ వచ్చిన బాధితురాలు..

అంబులెన్సులో కలెక్టరేట్ వచ్చిన బాధితురాలు..

తమకు చెందిన భూమిని ఆలయానికి ఇస్తే కొందరు కబ్జా చేసారంటూ ఓ వృద్ధురాలు సోమవారం అంబులెన్స్ లో వచ్చి ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆర్డీవో అంబులెన్స్ వద్దకు వచ్చి సమస్యను తెలుసుకున్నారు.

తమ భూమిలోని కొంత స్థలాన్ని కొండూరు శివారు నల్లపోచమ్మ ఆలయానికి విరాళంగా ఇవ్వగా కొందరు కబ్జా చేశారని యజమాని మణెమ్మ, ఆమె కొడుకు నరసింహ ఆర్డీవో ఎదుట వాపోయారు.

ఆలయ సమీపంలో తమకు 12 ఎకరాల 11 గుంటల స్థలం ఉందన్నారు. అందులోని 38 గుంటలను ఆలయానికి తన తండ్రి శంకర్ దానం చేశారని నరసింహ వివరించారు. దీంతో ఇద్దరు వ్యక్తులు చెరో 19 గుంటలు కబ్జా చేశారని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments