నగరంలో దొంగల ముఠా హల్ చల్..నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనీ మూడవ ఠాణా పరిధిలో ఆదివారం రాత్రి దొంగల ముఠా హల్ చల్ చేసింది. వివరాల్లోకి వెళ్లితే..నగరంలోని మూడవ టౌన్ పరిధిలోనీ హమల్ వాడి లో అనురాధ అనే మహిళ తన కుమారునితో ఉంటుంది. ఆదివారం ఫంక్షన్ నిమిత్తం చుట్టాల ఇంటికి వెళ్లింది.దీంతో గుర్తు తెలియని దొంగలు ఇంట్లొకి చొరబడి బీరువా తెరిచి అందులోని 4 తులాల బంగారం, కొంత వెండి ఆభరణాలు,కొంత నగదు అపహరించినట్టు పోలీసులు తెలిపారు. అలాగే మూడవ ఠాణా పరిధిలోనే మరో చోట తాళం పగల గొట్టినట్లు తెలుస్తుంది.స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. వివరాల కోసం సీసీ కెమెరాల ద్వారా ఆరా తీస్తున్నారు.
నగరంలో దొంగల ముఠా హల్ చల్..
RELATED ARTICLES
