డిమాండ్ ఈ రోజు ఏఐసీసీ మరియు పిసిసి ఆదేశాల మేరకు ఇటీవల పార్లమెంటులో అంబేద్కర్ గారిని అవమానిస్తూ మాట్లాడిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాటలకు నిరసనగా వెంటనే అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి కలెక్టర్ ద్వారా మెమోరండం ఇచ్చే కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ కార్యాలయం నందు జాయింట్ కలెక్టర్ గారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హాందం ,నూడా చైర్మన్ కేశవేణు అందరూ కలిసి మెమోరండం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో 10 సంవత్సరాలుగా పాలిస్తున్న బిజెపి పార్టీ 10 సంవత్సరాలుగా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ,అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆనవాళ్లను తుడిపి వేయాలనే ఆలోచన చేస్తుందని దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని మానాల మోహన్ రెడ్డి అన్నారు.
పార్లమెంటులో అమిత్ షా మాట్లాడుతూ మాటిమాటికి అంబేద్కర్ అనడం కంటే దేవుని ప్రార్థిస్తే మంచిదని చెప్పడం ఏదైతే ఉందో దానిని దేశ ప్రజలందరూ ఖండిస్తున్నారని, దేశ స్వాతంత్ర పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించి దేశానికి రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ గారి ఆనవాళ్లు తుడిచే ప్రయత్నం చేస్తున్న బిజెపికి రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారని, అదేవిధంగా పార్లమెంటులో ప్రధాని ముందే హోం మంత్రి అలా మాట్లాడితే మోడీ స్పందించకపోవడం చూస్తుంటే దీని వెనుక మోడీ కూడా ఉన్నారని భావిస్తున్నామని, కావున వెంటనే అంబేద్కర్ గారి గురించి తక్కువ చేసి మాట్లాడిన హోం మంత్రి అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలని, అమీత్ షా వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మానాల మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్,జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతారెడ్డీ రాజారెడ్డి,మాజీ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గోపి,జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపూల్ గౌడ్,జిల్లా NSUI అధ్యక్షులు వేణు రాజ్,జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సంతోష్,జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు లింగం,జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్,జిల్లా ఫిషర్ మన్ చైర్మన్ శ్రీనివాస్,మాజీ యూత్ కాంగ్రెస్ పార్లమెంటు అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ,నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు వినయ్,నగర ఎస్టీ సెల్ అధ్యక్షులు సుభాష్,నగర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మొహీన్,జిల్లా కాంగ్రెస్ డెలిగేట్ ప్రమోద్,మహిళా కాంగ్రెస్ నాయకురాలు అపర్ణ,సంగెం సాయిలు,శోభన్, ఏడపల్లీ సంజయ్,సాయి కిరణ్,అవీన్,అజీజ్ ఆన్సర్, ఆడెం సాయి కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు కృతజ్ఞతలతోయాస్.
