HomePOLITICAL NEWSనిష్కళంకుడి ....మహాబి నిష్క్రమణ ...మన్మోహన్ అంతక్రియలు శనివారం ....అధికార లాంచనాలతో ఏర్పాట్లు ........అమెరికా నుంచి బయలు...

నిష్కళంకుడి ….మహాబి నిష్క్రమణ …మన్మోహన్ అంతక్రియలు శనివారం ….అధికార లాంచనాలతో ఏర్పాట్లు ……..అమెరికా నుంచి బయలు దేరిన కూతురు …….నివాళుర్పించిన మోడీ …..శుక్రవారం సెలవు ప్రకటించిన తెలంగాణ సర్కార్

ప్రపంచ ములోనే పటిష్టమైం ఆర్థిక వ్యవస్థ ను భారత్ అమ్ముల పొది లో పెట్టిన ఘనత మన్మోహన్ సింగ్ దే రెండు దశాబ్దాల సుదీర్ఘ శ్రమ వల్లే ఆర్థిక మాద్యల తో అనేక అగ్ర దేశాలు కుదేలు అయ్యాయి అయినా భారత్ ఆర్థిక వ్యవస్థ చెక్కుచెదరలేదు. ఆర్థిక రథాన్ని ఎలా నడపాలో బాగా తెలిసిన సారథి…

ప్రణాళికవేత్త… అన్నింటికీ మించి పదే పదే ప్రశంసించదగిన సుగుణం… అవినీతి, అక్రమాలతో కుళ్లిన వర్తమాన రాజకీయ వ్యవస్థలోనే దశాబ్దాలపాటు కీలక స్థానాల్లో ఉన్నా సరే, ఏదీ అంటకుండా నిష్కళంకుడిగా బతికిన స్వచ్చుడు…తన ఆర్థిక విధానాలను, తన పాలన విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తులు, పార్టీలు కూడా ఆయన్ని ఎప్పుడూ అవినీతిపరుడిగా విమర్శలకు పోలేదు…

తను ప్రధానిగా ఉన్న పదేళ్ల యూపీఏ పాలనలో బోలెడు అక్రమాలు, అవినీతి బాగోతాలు… అది వైఫల్యం కాదా అనేవాళ్లూ ఉంటారు… తను నిస్సహాయుడు, యూపీఏ హయాంలో కాంగ్రెస్, దాని భాగస్వామ్య పక్షాల నిర్వాకాలకు తను మౌనసాక్షి మాత్రమే మొత్తం తన జీవితచరిత్రలో బాగా నచ్చేది ఈ స్వచ్ఛతే…

స్టేట్స్‌మన్ అనే పదానికి ఓ ఐకన్ తను… ఎక్కడా ఒక్క పదం కూడా తూలడు… వ్యర్థ ప్రసంగాలు ఉండవు… అమర్యాద, కుసంస్కారం, బంధుప్రీతి వంటివేమీ లేని టవరింగ్ పర్సనాలిటీ… అందుకే 92 ఏళ్ల జీవితం మకిలిపట్టలేదు…

టూజీ కుంభకోణంలో భ్రష్టుపట్టిన మాజీ కేంద్ర మంత్రి రాజా ఓసారి తమ నిర్ణయాలన్నీ ప్రధానితో సంప్రదించాక తీసుకున్నవే అని ఆరోపించాడు… మన్మోహన్ సింగ్‌కు బురద పూసి, తమపై ఆరోపణల తీవ్రత తగ్గించుకునే మూర్ఖపు ఎత్తుగడ… జాయింట్ పార్లమెంటరీ కమిటీ మన్మోహన్ సింగ్ తప్పు వీసమెత్తు లేదని క్లీన్ చిట్ ఇచ్చింది…

/////// పీవీ కాదు ఘనత /////

నిజానికి పీవీ తనను వెలుగులోకి తీసుకొచ్చాడు అంటారు కానీ కాదు… మినిస్ట్రీ ఆఫ్ పారిన్ ట్రేడ్ లలిత్ నారాయణ్ నారాయణ మిశ్రా తనను సలహాదారుగా తీసుకున్నాడు… అప్పటి నుంచే తను ఆర్బీఐ, ప్లానింగ్ కమిషన్ దాకా బోలెడు బాధ్యతలు నిర్వర్తించాడు…

అంతకుముందు సీనియర్ లెక్చరర్, రీడర్, ఐక్యరాజ్యసమితికి కూడా వర్క్ చేశాడు కాకపోతే పీవీ ఏకంగా తనను ఆర్థికమంత్రిగా తీసుకుని, కావల్సిన స్వేచ్చ ఇచ్చాడు… మన్మోహన్ విధానాల్ని తను ప్రధానిగా డిఫెండ్ చేసుకునేవాడు… ఆర్థిక సరళీకరణకు రథి పీవీ, సారథి మన్మోహన్‌సింగ్…

సోనియా ప్రధాని కావాలని భావించినా దేశం యావత్తూ నిరసన చెప్పేసరికి… తను చెప్పినట్టు నడుచుకునే ఓ నాన్ కంట్రవర్సీ బ్యూరోక్రాట్ ప్రధాని కావల్సి వచ్చాడు ఆమెకు… సో, పేరుకు ప్రధాని తనే… కానీ అసలు ప్రధాని కార్యాలయం టెన్ జనపథ్..!తన పిల్లలు కూడా ఉన్నత విద్యావంతులు…

ఎప్పుడూ ఎవరూ రాజకీయాల వాతావరణంలోకి రాలేదు… వర్తమాన రాజకీయ దుర్లక్షణాల వాసన కూడా సోకనివ్వలేదు… తక్కువ మాట్లాడాలి, ఎక్కువ పనిచేయాలి, దేశానికి ఏమైనా మంచి చేయాలి…

అందుకే పెద్దగా మీడియా ముందుకు కూడా వచ్చేవాడు కాదు… మొత్తానికి భారత దేశ చరిత్రలో ఐదేళ్లు ఆర్థిక మంత్రిగా పదేళ్లు ప్రధానిగా మన్మోహన్ సింగ్‌ది ఓ విశిష్ట అధ్యాయం….

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments