మహిళల సమానత్వం కోసం, వారి అభ్యున్నతి కోసం ఉద్యమం చేసిన సామాజిక విప్లవకారిణి సావిత్రీబాయి పూలే అని జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శివప్రసాద్ అన్నారు. శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో సావిత్రి భాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు గా సావిత్రిబాయి పూలే మహిళలకు విద్యను సులభతరం చేసేందుకు విశేషంగా కృషి చేశారని కొనియాడారు.
విద్య ప్రాముఖ్యతను తెలియజేస్తూ అనేక రకాల కార్యక్రమాలను నిర్వహించారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగమోహన్, డాక్టర్ జె తిరుపతి రావు వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె జె కిషోర్‌కుమార్ ఎడి సుదర్శన్ సూపరిండెంట్ పెద్దోళ్ల నాగరాజు గంగాధర్ సాయి బాబా, గాయత్రి, జ్యోతి గోవింద్, ప్రద్వీ రంజిత్ వైద్యులు, యుజి, పిజి విద్యార్థులు మరియు నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల సిబ్బంది పాల్గొన్నారు
