ఈనెల 7వ తేదీన మధ్యాహ్నం 3:00 గంటలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిచ్పల్లి గ్రామం కేఎన్ఆర్ గార్డెన్ నందు కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరుగుతుంది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు, రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ దీప్ దాస్ మున్షీ గారు, జిల్లా ఇన్చార్జి మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు,మాజీ మంత్రి, బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ గారు,ఎంఎల్సీ జీవన్ రెడ్డి గారు,రూరల్ ఎంఎల్ఏ భూపతి రెడ్డి గారు హాజరవుతున్నారు.
అదేవిధంగా ఈ కార్యక్రమంలోఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థులు, వివిధ రాష్ట్ర కార్పోరేషన్ చైర్మన్లు, పిసిసి డెలిగేట్స్, డిసిసి డెలిగేట్స్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, వివిధ మార్కెట్ కమిటీ చైర్మన్ లు, మున్సిపల్ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు పాల్గొంటారు.
