HomeCinemaవెకిలి మాటలు .....వెటకారపు నవ్వులు ......ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు వివాద స్పద...

వెకిలి మాటలు …..వెటకారపు నవ్వులు ……ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు వివాద స్పద వ్యాఖ్యలు ……సోషియల్ మీడియా లో ఉతికి ఆరేస్తున్న నెటిజన్లు

తెలంగాణ లో తెల్ల కల్లు మటన్ ముక్కలు ఉంటేనే వైబ్స్ వుంటాయి అదే ఆంద్ర లో సినిమా అంటేనే వైబ్స్ ఉంటాయి.అంటూ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్ష పదవీ వెలగబెడుతున్న సినిమా నిర్మాత దిల్ రాజు తన సొంత జిల్లానుంచే తెలంగాణ మీద అక్కసు వెళ్లగక్కాడు.

సోమవారం నిజామాబాద్ నగరంలో పాత కలెక్టరేట్ మైదానం లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఆయన మాట్లాడిన మాటలు సోషియల్ మీడియా లో వైరల్ గా మారాయి ఆయన అహంకారపూరిత మాటల మీద నెటిజన్లు ఏకి పారేస్తున్నాయ్ ముచ్చట అనే వెబ్ సైట్ సైతం రాజు వెకిలి మాటలు వెటకారపు నవ్వులంటూ ఏకి పారేసింది.

ఆంధ్రహీరో ఇండ్ల చుట్టూ ప్రదక్షిణలు వారి ప్రాపకం కోసం శ్రమించే రాజు కు అక్కడి ప్రజల అలవాట్లు సంస్కృతి సంప్రదాయలను ఎంతైనా పోగుడొచ్చు కానీ ఒక తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అధికారిక హోదా ఉండి అందులోనూ ఆయన సొంత ప్రి రిలీజ్ ఈవెంట్ వేదిక గా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల మీద వెకిలిగా మాట్లాడడం ఆపై వెటకారంగా నవ్వడం ఫై ఈవెంట్ కు వచ్చిన వారు సైతం ఈసడించుకున్నారు.

అంత సినిమా పెద్దలను రేవంత్ ముందు పరేడ్ చేయించిన తన సినిమాకే తెలంగాణాలో మాత్రమే సంక్రాంతి బెనిఫిట్ షో, టికెట్ల రేట్ల పెంపు లేనప్పుడు… అంతటి దిల్ రాజుకు తెలంగాణ జనాన్ని తిట్టాలనిపించదా. ఉతికి ఆరేయాలనిపించి ఉంటుంది. ఆ బాధను మనసులో దాచుకోలేక పుట్టి పెరిగిన ఊరు నిజామాబాద్ లో దిల్ రాజు నోటి దురద చూపెట్టాడు .

ప్రజల అలవాట్లను అవమానించాడు. ఆంధ్రాలో అయితే సినిమా అనగానే జనంలో వైబ్ ఉంటుందట.తెలంగాణాలో తెల్ల కల్లు, మటన్ ముక్కలంటేనే వైబ్ ఉంటుందట.

బహిరంగ వేదికమీద ప్రత్యక్షప్రసారంలో వెకిలినవ్వుల సాక్షిగా దిల్ రాజు తెలంగాణా ప్రజలకు ఇచ్చిన గుర్తింపు, గౌరవం, మర్యాద ఇదేనా ఇదే రాజు బ్యానర్ లో వచ్చిన బలగం ను ఆంధ్ర ఈడ్చి తన్నేసింది కానీ తెలంగాణ పల్లెల ఆదరించింది గుండెకు అత్తుకుంది.

మొన్ననే ఏపి జనసేనాని ఉపముఖ్యమంత్రి ఇచ్చిన బెనిఫిట్, రేట్ల పెంపు ఊపుమీద ఉన్న దిల్ రాజుకు సొంత ఊరివారు, సొంత రాష్ట్రంవారు సభ్యతలేని మనుషులుగా… మటన్, చికెన్ ముక్కలు, మందు చుక్కల కోసం ఎగబడే వెర్రిజనంగా కనిపించడంలో ఆశ్చర్యమేముందిలే ! అసలు .

 ఆంధ్రాభజన కోసమే దిల్ రాజుకు రేవంత్ పదవి ఇచ్చాడో! ఏమో!హైదరాబాద్ సంధ్యలో రేవతి ఊపిరి ఆగింది. గేమ్ ఛేంజర్ రాజమండ్రితో రెండు ప్రాణాలు పోయాయి. సినిమా ఈవెంట్లు ఏమన్నా ఆగాయా? ఆగవు కాక ఆగవు.

పైగా నిజామాబాద్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు రాజు అడిగింది మహా భాగ్యం అన్నటుగా పోలీసులు ఉరుకులు పరుగులుగా పర్మిషన్ ఇచ్చేసారు!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments