HomeCRIMEగంజాయి విక్రయిస్తున్న యువకులు రిమాండ్..

గంజాయి విక్రయిస్తున్న యువకులు రిమాండ్..

నగరంలోని నాలుగవ టౌన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు యువకులను పట్టుకొని రిమాండ్ కు తరలించినట్లు టౌన్ సిఐ శ్రీనివాస్ రాజ్ పేర్కొన్నారు.

వివరాల్లోకి వెళ్లితే నగరంలోని వినాయక నగర్ లో గంజాయి విక్రయిస్తున్నట్లు విశ్వసనీయమైన సమాచారం మేరకు నాలుగవ టౌన్ పోలీసులు టీం తో వినాయక నగర్ లో ఒక ఇంటిపై దాడి చేసి నలుగురు వ్యక్తులు ఆకాష్, రోహిత్ కుమార్, శివరానా రామతేజ్ రెడ్డి,

రాకేష్ ఇంకా ఒక మైనర్ బాలుడు లను పట్టుకుని వారి వద్ద నుండి మొత్తం 461 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.వారి నుంచి ఐదు సెల్ ఫోన్లు రెండు మోటార్ సైకిల్ ఒక కారు లను, గంజాయి ప్యాకింగ్ చేయటానికి ఉపయోగించే 18 ఖాళీ ప్లాస్టిక్ కవర్స్ ను పంచనామ నిర్వహించి సీజ్ చేసి, స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఐదుగురిని కోర్టుకి రిమాండ్ తరలించినట్లు పేర్కొన్నారు. నిజామాబాద్ లో ఎవరైనా డ్రగ్స్ కార్యకలాపాలు నిర్వహించినట్లయితే కఠిన చర్య టీసుకొనబడును.

వీటిని అరి కట్టడానికి పై అధికారుల ఆదేశాల మేరకు గట్టి నిరంతర నిఘా పెట్టడమైనది. .ప్రజల సహకారం తో గంజాయి భూతం నిర్మూలన కు కృషి చేయాలని కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments