త్వరలో జరగనున్న పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలకు బీజేపీ తమ అభ్యర్థిని ఎట్టకేలకు ఖరారు చేసింది.అభ్యర్థి విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ తన పంతం నెగ్గించుకున్నారు. మెదక్ జిల్లాకు చెందిన అంజిరెడ్డి బీజేపీ అభ్యర్థిగా ఖరారు అయ్యారు.
ఆయన కు అవకాశం ఇవ్వాలని కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ పట్టు బడుతూ వచ్చారు. చివరికి అధిష్టానం సైతం ఆయన వైపే మొగ్గు చూపింది.
ఈ నియోజకవర్గ పరిధి నియోజకవర్గం పరిధి నాలుగు ఉమ్మడి జిల్లాల్లో విస్తరించి ఉంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లా లున్నాయి.నాలుగు జిల్లాల్లోనూ బిజెపికి చెందిన ఎంపిలే ఉన్నారు. ఆదిలా బాద్ మినహా మిగితా ముగ్గురు ఎంపిలు బిజెపి దిగ్గజ నేతలే ఖ్యాతి పొందిన వారే.
అందుకే అభ్యర్థి విషయంలోనే రగడ మొదలయ్యింది. ఎవరూ తగ్గేదే లేదు అన్నట్లు గా ఉన్నారు. ఎన్నికల ప్రక్రియ సంగతి ఎలా ఉన్న అభ్యర్థి ఎంపికే అత్యంత క్లిష్టం గా ఉండే . ఉమ్మడి జిల్లా లు నాలుగే అయినా ప్రస్తుతం 13 జిల్లాలు న్నాయి. అధిష్టానం ముగ్గురు సీనియర్ నేతలతో ఓ కమిటీని వేసింది. అభ్యర్థి ఎవరనేది ప్రతిపాదించే కార్యం కమిటీ మీదే వేసింది.
సో రంగంలోకి దిగిన కమిటీ ఎంపి, ఎమ్మెల్యేలు జిల్లా అధ్యక్షులు పార్టీకేంద్ర రాష్ట్ర నేతల అభిప్రాయాలను తెలుసుకుంది.
ముఖ్యంగా ఎంపి సూచించిన అభ్యర్థుల విషయంలోనే ఈ కమిటీ ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చింది. ఎమ్మెల్సీలు ఎన్నికలు జరిగే నాలుగు జిల్లాల్లోనూ బిజెపి నాయకులే ప్రాతినిధ్యం వహిస్తుండడంతో ఇక్కడే అసలు చిక్కు వచ్చింది.
ఆదిలాబాద్ ఎంపి నగేష్, నిజామాబాద్ ఎంపి ధర్మపురి అర్వింద్, మెదక్ ఎంపి రఘునందర్రావులు మంచిర్యాల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు రఘునందరావు పేరును మూకుమ్మడిగా ప్రతిపాదించారు.
ఆయా జిల్లాల అధ్యక్షులు సైతం ఆయన పేరు బలపరి చారు. కానీ కరీంనగర్ ఎంపి కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ రఘునందరావు అభ్యర్థిత్వానికి ససేమిరా అన్నారు. మెదక్ జిల్లా అధ్యక్షురాలు గోదావరి భర్త అంజిరెడ్డికు కి అవకాశం ఇవ్వాలని కేంద్రం నాయకత్వం మీద ఒత్తిడి చేస్తూ వచ్చారు .
ఈ మేరకు త్రిసభ్య కమిటీకి అంజి రెడ్డి పేరును ప్రతిష్టాంచారు. బండి సంజయ్ ప్రతిపాదించిన అంజిరెడ్డి విషయంలో ముగ్గురు ఎంపిలు ససేమిరా అన్నారు.
మరోవైపు తన జిల్లాకు చెందిన నేతను ఎమ్మెల్సీ టికెట్ రేసులోకి తేవడంపై మెదక్ ఎంపి రఘునందన్ రావు సైతం లోలోన రగిలిపోయారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక ఉత్కంఠగా మారింది కానీ చివరికి అధిష్టానం అంజిరెడ్డి నే రంగంలోయ్ దించింది.
