కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారం లో నాటు బాంబు పేలి శిరీష అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన మహిళ పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. నాటు బాంబు పేలుడు ధాటికి ఇల్లు అంతర్భాగం పాక్షికంగా ధ్వంసమైంది. అటవీ జంతువుల వేట కోసం వాడే నాటు బాంబువల్లే ఈ పేలుడు జరిగిందని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు గాయపడ్డ శిరీష భర్త తరుచు అటవీ జంతువుల వేటకు వెళ్తారని వెల్లడయింది . రామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.