కామా రెడ్డి జిల్లా సదశివనగర్ మండలంలోని పద్మజివాడి వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన దంపతులిద్దరూ..అంత్యక్రియలకు వెళ్తుండగా వెనక నుంచి వేగంగా వచ్చిన ట్రక్కు స్కూటర్ ను బలంగా ఢీకొంది. దీంతో భార్య అక్కడికక్కడే మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యయి. గాయాలైన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.