లోకసభ అభ్యర్థిగా ఎవరిని రంగంలోకి దించాలనే విషయంలో బిఆర్ యస్ ఎటూ తేల్చుకోలేక పోతుంది. సామజిక ఆర్థిక అంశాలను పరిగణలోకి తీసుకోని ఎడతెగని కసరత్తులు చేస్తుంది. తాజా మరో ఆన్ లైన్ సర్వే చేయిస్తుంది.ఎలాగో అర్వింద్ బీజేపీ అభ్యర్థి గా ఖరారు అయ్యారు. కాంగ్రెస్ ఎవరిని రంగంలోకి దించుతుందనేది బిఆర్ యస్ అరా తీస్తుంది. మాజీ ఎమ్మెల్యే లెవ్వరు పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదు.
ప్రజాక్షేత్రంలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారీ ఆర్థిక భారం పడే లోకసభ బరిలోకి దిగడానికి దిగ్గజ నేతలు వెనుకాడుతున్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికల పలితాలతో డీలా పడ్డ బిఆర్ యస్ లోకసభ ఎన్నికల్లో సత్తా చాటే దిశగా కసరత్తులు చేస్తుంది. పార్టీ మనుగడ ను లోకసభ ఫలితాలే దిశానిర్దేశం చేయనున్నాయి. ఉద్యమ కాలం నుంచి పార్టీకి కంచుకోటగా ఉన్న జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకుంది.లోకసభ నియోజకవర్గం లో ఏడు అసెంబ్లీ స్థానాలుంటే ఒకే స్థానంలో బిఆర్ యస్ ఎమ్మెల్యే కు ప్రాతినిధ్యం దక్కింది.
అనూహ్య పలితాలతో క్యాడర్ లోనూ నిరాశ నిస్పృహ లు అలుముకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన నేతలు కూడా నియోజకవర్గాల కు రాకుండా మొహం చాటేస్తున్నారు. ద్వితీయ శ్రేణి నేతలు కండువా మార్చేస్తున్నారు దీనితో క్యాడర్ కు దిక్కుతోచడం లేదు. అందుకే లోకసభ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు సాధించడం ద్వారానే పార్టీ ప్రాబల్యం కాపాడాలనేది అధినేత ఆలోచనగా ఉంది.
అందుకే ఎమ్మెల్సీ కవిత పోటీ కి సిద్ధం అవుతున్న సరే కెసిఆర్ నుంచి లైన్ క్లియర్ కావడం లేదు. ఆమె కన్న బలమైన నేత కోసం అన్వేషణ సాగుతుందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ప్రవాస భారతీయుడు బిగాల మహేష్ ,బాజిరెడ్డి గోవర్ధన్ విజి గౌడు ల పేర్లు పరిశీలనకు వచ్చాయట. కానీ ఇందులో మహేష్ తప్పా మిగితా ఇద్దరు ఆర్థిక కారణాల తో ఆసక్తి చూపడం లేదని సమాచారం