నిజామాబాద్ నగరం వినాయక్ నగర్ లో బుధవారం తెల్లవారు జామున హత్య కలకలం రేపింది. స్థానికంగా ఉండేమద్యం బెల్ట్ షాప్ లో జరిగిన గొడవే హత్యకు దారితీసిందని భావిస్తున్నారు.అదో అక్రమ మద్యం కు అడ్డా అనేది ఈ హత్య తోనే వెలుగులోకి వచ్చింది.
అసలు అక్కడ ఏళ్ల తరబడిగా ఓ బెల్ట్ షాప్ చెలామణి లో వుందని యథేచ్ఛగా అక్రమ మద్యం అమ్మకాలు జరుగుతాయనేది అదికూడా ఆబ్కారీ పోలీసు అధికారాలకు భారీగా మామూళ్ల నజరానాలు అందుతాయని హత్య ఉదంతం తో బట్టబయలు అయింది.
హత్యకు పాల్పడింది ఎవరు ? ఎందుకు కిరాతకంగాహత్య చేసారనేది ఫై పోలీసుల దర్యాప్తు మొదలయ్యింది.హత్య సంగతి ఎలా ఉన్న సంఘటన స్థలం అసాంఘిక శక్తులకు అడ్డాగా వుందనేది సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. మారుమూల ప్రాంతం లో బెల్ట్ షాప్ నడుస్తుందంటే ఏమో అనుకోవచ్చు.
కానీ జిల్లా కేంద్రంలో అదీగాక హైదారాబాద్ వెళ్లే మెయిన్ రోడ్డు కు పక్కనే పైగా పోలీసు కమిషనరేట్ జస్ట్అర కిలో మీటర్ దూరంలో ఉండే వినాయక్ నగర్ లో ఏళ్ల తరబడిగా ఓ బెల్ట్ షాప్ ఏర్పాటు కావడం పోలీసు శాఖ నిఘా వ్యవస్థ లో వైఫల్యాలను వెక్కిరిస్తున్నాయి.
సరే ఎదో బతుకు దెరువు కోసం ఎదో చాటు మాటున మద్యం అమ్ముకుంటున్నారంటే అదికాదు రాత్రి పది గంటలకు మొదలై తెల్లవారు జామున అయిందింటి దాక ఇక్కడ మద్యం అమ్మకాలు సాగుతాయి. అదికూడా చాటుమాటున కాదు.
బాహాటంగానే. నిజామాబాద్ నగరంలో హోటళ్లు, బార్ లను నిర్ణిత సమయంలోనే మూసేయాలంటూ పెట్రోలింగ్ పోలీసులు రాత్రి 11 గంటలకే సైరన్ లతో హడావుడి చేస్తారు. బార్ లు వైన్స్ లు మూతపడగనే మద్యం ప్రియులు నేరుగా వినాయక్ నగర్ లో ఈ బెల్ట్ షాప్ వైపే పరుగులు తీస్తారు.
ముఖ్యంగా యువకులకు ఇక్కడ మద్యం ఏ రాత్రైనా దొరుకుతుందని నమ్మకంగా వెళతారు. ఆబ్కారీ శాఖ నిర్దేశించిన ధరల కన్న ఎక్కువ రేట్ల కే మద్యం విక్రయిస్తారు. అంతే కాదు మద్యం తో పాటు నాన్ వెజ్ వంటకాలు ఇతర స్నాక్ లు కూడా ఈ బెల్ట్ షాప్ లో అందుబాటులో ఉంటాయి.
జేబులో నగదు చిల్లి గవ్వలేక పోయిన సరే ఇక్కడ డిజిటల్ పేమెంట్ సౌకర్యం కూడా ఉంది. హోటళ్ల తో పాటు వ్యాపార సముదాయాలను రాత్రి 11 గంటలకే దగ్గరుండి మరీ మూసేయిస్తున్న పోలీసులు ప్రధాన రోడ్డు పక్కనే బెల్ట్ షాప్ ఎలా తెల్లవారు జామున దాక ఎలా తెరిచి ఉంటుందనేది అందరికి తెల్సిన రహస్యమే అదే ఆ బెల్ట్ షాప్ నిర్వాహకుడి తో స్థానిక పోలీసులకు మామూళ్ల బంధం అత్యంత గాఢంగా వుండడమే.!
