పార్కింగ్ లో ఉన్న ఓ ప్రైవేట్ బస్సుకు కొందరు దుండగులు నిప్పు పెట్టిన ఘటన హైదరాబాద్ లో ని . టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని టోలీ మసీదు వద్ద బుధవారం జరిగింది.
మసీద్ పక్కన వాహానాలు పార్కింగ్ చేసి ఉంటాయి. అక్కడే ఓ ప్రైవేట్ బస్సును కూడా పార్క్ చేసారు. కానీ గుర్తు తెలియని ఆకతాయి లు నిప్పు పెట్టారు. బస్సు లో నుంచి అకస్మాత్తుగా మంటలు రావడం స్థానికులు వెంటనే అప్రమత్తం అయ్యారు బస్సు పక్కనే ఉన్న ఇతర వాహానాలను ఉన్నపలంగా అక్కడి నుంచి తరలించారు.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని, మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఈ లోపే బస్సు పూర్తిగా దగ్దం అయ్యింది.రంగంలోకి దిగిన పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు పార్కింగ్ లో ఉన్న బస్సుకు కొందరు దుండగులు నిప్పు పెట్టిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని టోలీ మసీదు వద్ద గోడ పక్కన నిత్యం కొన్ని వాహానాలు పార్కింగ్ చేసి ఉంటాయి.
అందులో ఓ ప్రైవేట్ బస్సుకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో దాని పక్కనే ఉన్న ఇతర వాహానాలను పార్కింగ్ నుంచి తప్పించి పెద్ద ప్రమాదం జరకుండా చూశారు.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని, మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఈ లోపు బస్సు పూర్తిగా దగ్దం అయ్యింది. . దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై స్థానికులను అరా తీశారు. కొందరు ఆకతాయి లే ఈ ఘటన కు బాద్యులుగా అనుమానిస్తున్నారు