తాళం వేసిన ఇల్లు కనబడితే చాలు లూటీ చేస్తున్నారు.తాజాగా నందిపేట్ మండంలోని వెల్మల్ గ్రామంలో మంగళవారం రాత్రి దొంగలు హల్ చల్ చేశారు.
నందిపెట్ ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.మండలంలోని వెల్మెల్ గ్రామంలో బొడ్డు చంద్రశేఖర్ ఇంట్లో మరియు అదే గ్రామానికి చెందిన బర్లపాటి ప్రవీణ్ ఇళ్లలో సుమారు15 తులాల బంగారం, సుమారు తొమ్మిది లక్షల నగదు అపహరణ జరిగినట్లు పోలీసులు తెలిపారు.
బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నందిపేట్ ఎస్ఐ తెలిపారు.
