, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ వారి ఆద్వర్యంలొకోల్ కత్తా లో పీజీ వైద్యురాలు డా. మౌమిథ పై కొందరు దుండగులు హత్యాచారం చేసిన ఘటనను నిరసిస్తూమంగళవారం రాత్రి కొవ్వతుల ర్యాలీ నిర్వహించారు
సాయంత్రం 6గంటల 30 నిమిషముల నుండి 7 గంటల 30నిమిషాల వరకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల నుండి బస్టాండ్ మీదుగా తిలక్ గార్డెన్ వరకు IMA వైద్యులు కొవ్వత్తుల ప్రదర్శన తో నల్ల బ్యాడ్జీలు ధరించి భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్బంగా IMA అధ్యక్షులు డా. దామోదర్ రావు, ప్రధాన కార్యదర్శి డా. కొట్టూరు శ్రీశైలం గార్లు మాట్లాడుతూ అసాంఘిక శక్తులు ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులపై దాడులను అడ్డుకొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలన్నారు ప్రభుత్యాలు వైద్యులకు రక్షణ కల్పించాలని డిమాండు చేశారు.
కోల్కతాలో పీజీ వైద్యురాలు డా. మౌమిథ పై జరిగిన అమానుష ఘటనను నిరసిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో IMA అధ్యక్షులు డా. దామోదర్ రావు, ప్రధాన కార్యదర్శి డా. కొట్టూరు శ్రీశైలం, IMA రాష్ట్ర ముఖ్య సలహాదారులు
డా. E. రవీంద్ర రెడ్డి, డా. వినోద్ కుమార్ గుప్తా, ఉపాధ్యక్షులు డా. విశాల్, డా. జలగం తిరుపతి రావు, కార్యవర్గ సభ్యులు డా. దీపక్ రాథోడ్, డా. హరీష్ స్వామీ, డా. అనుమల్ల సత్యా నారయణ, డా. ఫరీద బేగం, డా. పద్మిణి రెడ్డి, డా. రాజేందర్, డా. R. రజశెఖర్ డా. గీత పాటిల్, డా. అరుణ, డా. ప్రఙ డా. ఓంకరే నరేంద్ర IMA వైద్యులు 60, మరియు మెడికల్ కాలేజి వైద్య విద్యార్థులు , ప్రభుత్వ, మరియు ఆల సరొజనమ్మ నర్సింగ్ కళాశాల విధ్యార్థులు150 పైగా పాల్గొన్నారు…