ఆయనో మాజీ మంత్రి కి స్వయానా అల్లుడు …మామ అధికార పార్టీలో కీలక నేత అదీగాక ప్రభుత్వ పెద్దలతో దోస్తీ ఉంది..యంత్రాంగం మీద కర్రపెత్తనం చేయడానికి ఆ మాత్రం అర్హత సరిపోతుందని అనుకున్నాడు.
అందుకే పార్టీ అధికారం లోకి రావడమే ఆలస్యం అనుకున్నాడు.మామ కోసం క్షేత్ర స్థాయిలో క్రియాశీలకంగా పనిచేసిన అల్లుడు కి జిల్లాలో ఉండే మంజీరా పరివాహకం లో అపారమైన ఇసుక క్వారీల మీద దృష్టి పడింది.
కానీ గత ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన క్వారీల్లో ఇసుక తవ్వకాలకు టెండర్లు ఇచ్చేసింది. గత ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులుగా ఉన్నవారే ఆ క్వారీల ను దక్కించుకున్నారు ఏళ్ల తరబడిగా వారే గుత్తాధిపత్యం.
చెలాయిస్తున్నారు అందుకే ప్రభుత్వం మారిన సరే ఆ క్వారీల్లో ఇసుక తవ్వకాల కు గడువు పూర్తీ అయినా సరే యథేచ్ఛగా తవ్వకాలు సాగించారు. ఇందులో బీర్కూర్ మండలం రెండు క్వారీల ఉన్నాయి. ఈ క్వారీల్లో ఆర్మూర్ కు చెందిన ఓ గుత్తేదారు రెండేళ్ల క్రితం దక్కించుకున్నారు.
ఎమ్మెల్సీ కవిత యంత్రాంగం మీద ఒత్తిడి చేసి ఈ క్వారీలు తన సన్నిహితుడికి దక్కేలా గతంలో చక్రం తిప్పారు. అదే క్వారీ లమీద మాజీ మంత్రి అల్లుడు కన్ను పడింది అంతే గద్దలా వెళ్లి వాలాడు. ఎలాగో తవ్వకాలు ఇల్లీగల్ కావడంతో గుత్తేదారు సైతం బెంబేలెత్తి పోయాడు.
మాజీ జడ్పిటిసి ని మధ్యవర్తి పెట్టుకొని సదరు గుత్తేదారు ను తన దారిలోకి తెచ్చుకున్నఅల్లుడు క్వారీ నిర్వహణ తన చేతిలోకి తెచ్చుకున్నాడు మామ ఎలాగో బడా నేతకావడంతో అల్లుడు గారు క్వారీబరిలోకి దిగాడు.
నయా పైసా పెట్టుబడి లేకుండా కోట్ల రూపాయల విలువైన ఇసుక క్వారీ అల్లుడు సులువుగా కొట్టేసాడు. కాసులు కురిపించే ఇసుక దందా కోసం రాజకీయ వైరాలు సైతం పక్కకు పెట్టేసారు. గుత్తేదారు గా అవతారం ఎత్తి గులాబీ నేత కు చెందిన రెండు క్వారీ ల్లో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు సాగించారు.
టీఎస్ యం ఐ డీసీ సైతం కనీసం అటు వైపు కన్నెత్తి కూడా చూడలేదు.దాదాపు రెండు నెలల పాటు రాత్రిబవళ్ళు ఇసుక తవ్వకాలు సాగించారు.
అంచనాలకు అంతా సవ్యంగా సాగుతుందనుకుంటున్న క్రమం లోనే అధికార పార్టీకి చెందిన కీలక ప్రజాప్రతినిధి తన వాటాల మాటేమిటి అంటూ సన్నాయి నొక్కులు మొదలు పెట్టాడు.
ఎహే మామ ఎవరో తెల్సా అంటూ అల్లుడు గారు ఇచ్చిన బిల్డప్ తో సదురు నేతకు చిర్రు మంది వెంటెనే సీఎంవో స్థాయిలో పిర్యాదు లు చేసాడు. అంతే అధికారులు రంగంలోకి దిగారు.
ఈలోపు మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మెన్ గా నియామకం అయిన అనిల్ ఇరవత్రి సైతం ఎంట్రీ ఇచ్చాడు. గడువు తీరిన క్వారీల్లో తవ్వకాలు ఎలా చేస్తారంటూ గద్దించారు. దీనితో క్వారీల్లో తవ్వకాలు నిలిపి వేశారు.
జేసీబీ టిప్పర్ లను సైతం ఆ పాయింట్ లనుంచి తరలించారు. సాఫీగా సాగుతున్న ఇసుక తవ్వకాల్లో అడ్డంకులు రావడంతో అల్లుడు మామ ను రంగంలోకి దించే యత్నాల్లో ఉన్నారు.