ఒకరు మృతి ఆగి ఉన్న ఓ లారీని వెనక నుంచి కారు ఢీ కొనడంతో ఒకరు మృతి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన ఇందల్వాయి మండలం గన్నారం 44వ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న ఓ కారు ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీ కొనడంతో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడకు చెందిన నర్సింహరెడ్డిగా మృతి చెందినట్లు తెలిపారు.
అలాగే డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.
ప్రమాదంపై వివరాలు కోరగా ఘటన స్థానిక వెళ్లి వివరాలు సేకరిస్తున్నట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు.
