గంజాయి విక్రయదారులపై పోలీసులు మెరుపు దాడి చేశారు. అక్రమంగా గంజాయిని నిల్వ ఉంచి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు పట్టుకొని వారిపై కేసు నమోదు చేశారు.
ఈ ఘటన నగరంలోని ఒకటవ టౌన్ పరిధిలో చోటుచేసుకుంది.ఎస్హెచ్ఓ రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం..
నగరంలోని శాంతి నగర్ కు చెందిన ఓ వ్యక్తి తన మైనర్ బాలుడితో కలిసి ఫ్రూట్ మార్కెట్ ప్రాంతం లోని ఓ పాన్ షాపులో గంజాయి విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం పోలీసులు దాడి చేసి వారి నుంచి 130 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
అలాగే వీరిని అదుపులోకి తీసుకొని విచారించగా జియా అనే వ్యక్తి సరఫరా చేస్తున్నట్లు నేరం ఒప్పుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ముగ్గురి పై కేసు ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
