నగరంలో ఒక్కసారిగా కత్తిపోట్లు కలకలం సృష్టించాయి. ఓ వ్యక్తిపై ప్రత్యర్థి కత్తితో విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన స్థానికంగా భయాందోళనలకు గురిచేసింది.ఈఘటన నగరంలోని ఐదవ టౌన్ పరిధిలోని బాబన్ సహాన్ పహాడ్ లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్లితే.. అసద్ బాబా నగర్ కు చెందిన సాదిక్ అనే వ్యక్తిపై శుక్రవారం బాబన్ సహాన్ పహాడ్ ప్రాంతంలో గుర్తుతెలియని మధ్య జరిగిన ఘర్షణ లో ఒక్కసారిగా కత్తితో పొడవడంతో బాధితుడు తీవ్ర రక్తగాయాలపాలై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.వెంటనే గమనించిన స్థానికులు తీవ్రంగా గాయపడిన సాదిక్‌ను చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆయన పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు.
ఈ దాడికి గల కారణాలు ఏంటి? పాత కక్షలా లేక మరేదైనా వివాదమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
