HomeCRIMEకోఠి లో కాల్పుల కలకలం ….నగదు డిపాజిట్ చెయ్యడానికి వచ్చిన వ్యక్తి మీద కాల్పులు …….....

కోఠి లో కాల్పుల కలకలం ….నగదు డిపాజిట్ చెయ్యడానికి వచ్చిన వ్యక్తి మీద కాల్పులు …….. ఖైరతాబాద్ జోన్ డిసిపి శిల్పవల్లి

రాజధాని హైదరాబాద్ లో మరోసారి కాల్పులఘటన కలకలం రేపింది. నగదు డిపాజిట్ చేయడానికి వచ్చిన ఓ వ్యక్తిమీద ఆగంతకులు విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడ్డారు.


రిషద్ కోఠి లోని ఎస్బిఐ ఏటీఎం లో నగదు డిపాసిట్ చేయడానికి శనివారం ఉదయం 6.50 కు వచ్చాడు దుండగులు కాల్పులు జరిపారు.రిన్షద్ నాంపల్లి కి చెందిన బట్టల వ్యాపారి.ఎప్పటిలాగే రూ 6లక్షలు డిపాసిట్ చేయడానికి ఎస్బిఐ డిపాజిట్ బాక్స్ కు వచ్చాడు.

అదే సమయంలో మెరుపు వేగంతో వచ్చిన దుండుగులు రిన్షద్ పై కాల్పులు జరపడం తో అక్కడే కుప్పకులాడు
రిన్షద్ తెచ్చిన 6లక్షల నగదుతో పాటు అతని బైక్ తో తీసుకొని దుండగులు పారిపోయారు.

కాల్పుల్లో గాయపడ్డ రిషద్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు . రిన్షద్ ప్రాణమయం లేనట్లు వైద్యులు నిర్దారించారు. విషయం తెలియగానే డీసీపీ శిల్పవల్లి హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చారు దుండగులను పట్టుకోవడానికి అయిదు బృందాలను రంగం లోకి దించినట్టుగా ఆమె తెలిపారు

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments