Monday, April 20, 2026
HomeTelanganaNizamabadకంజర సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ చేపట్టాలి ~PDSU డిమాండ్

కంజర సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ చేపట్టాలి ~PDSU డిమాండ్

పీఎంశ్రీ కంజర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం నిధుల దుర్వినియోగానికి పాల్పడుతూ, విద్యార్థుల వద్ద నుండి ఫైన్ ల పేరుతో అక్రమ వసూళ్లు చేస్తున్న ప్రిన్సిపాల్ విజయలలిత గారిపై సమగ్ర దర్యాప్తు జరపాలని, నిధులను రికవరీ చేయాలని, ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ,జిల్లా అదనపు కలెక్టర్ గారికి PDSU
ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా PDSU అధ్యక్షులు కర్క గణేష్, ప్రధాన కార్యదర్శి ఎల్. అనిల్ లు మాట్లాడుతూ, కంజర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అక్కడి ప్రిన్సిపాల్ విజయలలిత గారు ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ప్రతినెల తప్పుడు మెస్ బిల్లులు, మెయింటెనెన్స్ బిల్లులతో నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు.

ముఖ్యంగా పీఎంశ్రీ ద్వారా వస్తున్న లక్షలాది రూపాయల నిధులను తప్పుడు బిల్లులు పెట్టి పక్కదారి పట్టిస్తున్నారన్నారు. తనకు అనుకూలమైన వారితో పీఎంశ్రీ కమిటీని ఏర్పాటు చేసి, పీఎంశ్రీ నిధుల వివరాలను, వ్యయాలను అత్యంత గోప్యంగా ఉంచుతూ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు.


అంతేకాకుండా అడుగడుగునా విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేస్తూ ఫైన్ ల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు.
అక్రమ వసూళ్లకు సహకరించే వారిపై పక్షపాతాన్ని, సహకరించని సిబ్బందిపై వివక్షతను ప్రదర్శిస్తున్నారన్నారు.

ఒకరిద్దరు సిబ్బందిని తనకు సహకరించేలా మచ్చిక చేసుకుని, యదేచ్చగా తన వసూళ్ల పర్వాన్ని కొనసాగిస్తున్నారన్నారు. పైఅధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు జాగ్రత్తపడుతూ, తనపై ఏ విధమైన చర్యలు తీసుకోకుండా మేనేజ్ చేస్తున్నారన్నారు.

ప్రతి తరగతిలో ఒక సీక్రెట్ లీడర్ ని నియమించుకుని, విద్యార్థుల చిన్న చిన్న తప్పులను పెద్దవిగా చేసి చూపుతూ, వారిని టార్గెట్ చేసి ఏదో ఒక రకమైన ఫైన్లు వసూలు చేయిస్తున్నారన్నారు.

వసూలైన డబ్బులను పాఠశాల అభివృద్ధి కోసం ఖర్చు చేశారా? అంటే అదీ లేదు,ఈ విషయమై మేము కొద్ది మంది విద్యార్థుల ద్వారా, వారి తల్లిదండ్రుల ద్వారా సేకరించిన సమాచారం ఘటనలను మీకు తెలియజేస్తునామన్నారు.


2024 సంవత్సరంలో విహారయాత్ర కోసం 05 బస్సులను ఏర్పాటు చేసి, 07 బస్సులు ఏర్పాటు చేశామని బిల్లులు పెట్టి, 02 బస్సుల డబ్బులను స్వాహా చేశారన్నారు. క్రీడా మైదానానికి లేటుగా వచ్చారన్న సాకుతో ఒక్కో విద్యార్థిని దగ్గర 30 రూపాయలు వసూలు చేశారన్నారు.

చలికాలం వేడి వాటర్ తీసుకెళ్లేటప్పుడు ఆ వేడిపొగ మొహానికి తగిలిందని, బకెట్ లో నుండి వాటర్ ముఖం పైన చల్లుకున్నందుకు 100 రూపాయలు వసూలు చేశారన్నారు. రిబ్బన్స్ సరిగా కట్టుకోలేదని కొత్త రిబ్బన్లు కొనాలని ఒక రకమైన ఫైన్, బ్రేక్ ఫాస్ట్, లంచ్ మరియు డిన్నర్ చేసే దగ్గర ప్లేటులో కరివేపాకు మిగిలిపోయిందని పడేస్తున్నందుకుగాను 100 రూపాయల చొప్పున వసూలు చేశారన్నారు.

ప్లేట్లు కడుక్కునే కుళాయిలు (TAPS) హైట్ ఎక్కువగా ఉండి ప్లేట్లు కడుగుతున్నప్పుడు వాటర్ కాళ్లపై పడిందని ఆ కాళ్లు కడుక్కున్నందుకు 100 రూపాయలు వసూలు చేశారన్నారు.

పాఠశాలలో ఉన్న చెట్ల మధ్యలో నుండి నడిచినందుకుగాను ముఖ్యంగా రెండు చెట్ల మధ్యలో నుండి నడిస్తే ఒక్కొక్క విద్యార్థిని దగ్గర 100 రూపాయల చొప్పున వసూలు చేశారనీ తెలిపారు. పొరపాటున మెస్ లో ఎవరైనా బెంచి పైనుండి ఎక్కి, దిగితే 100 రూపాయలు వసూలు చేయడం జరిగిందన్నారు.

సండే రోజు స్టడీ అవర్ కు లేటుగా వచ్చారనే పేరుతో 30 రూపాయలు చొప్పున వసూలు చేశారని పాఠశాలల్లో ఉన్న గదులకు తాళాలు వేయడం కోసం ఒక్కొక్క విద్యార్థి దగ్గర 50 రూపాయలు, అదే తరగతి గదిలో గోడగడియారానికి ఒక్కొక్క విద్యార్థిని దగ్గర 40 రూపాయలు వసూలు చేయడం జరిగిందనీ తెలిపారు.

విద్యార్థులు మెస్ దగ్గర మరియు బాత్రూం దగ్గర హ్యాండ్ వాష్ చేసుకోవడానికి హ్యాండ్ వాష్ కోసం ఒక్కొక్క విద్యార్థిని దగ్గర 15 రూపాయల నుండి 30 రూపాయల వరకు వసూలు చేయడం జరిగింది, చీపురు కట్టల కోసం 50 రూపాయల చొప్పున వసూలు చేశారన్నారు. వి

ద్యార్థులు బస చేసే డార్మెటరీలో చార్జింగ్ లైట్లు కోసం ఒక్కొక్క విద్యార్థిని దగ్గర 100 రూపాయల చొప్పున వసూలు చేశారన్నారు. బ్రేక్ టైంలో లేటు వచ్చినందుకు ఫైన్ లు వసూలు చేయడం జరిగిందన్నారు. 2024 ఆగస్టు 15 న 100 నుండి 150 విద్యార్థులు కంజర గ్రామంలో ప్రదర్శనలో పాల్గొనడం కోసం ఒక్కొక్క విద్యార్థిని దగ్గర 750 రూపాయల చొప్పున వసూలు చేశారన్నారు.


అదే 2025 ఆగస్టు 15 పరేడ్ గ్రౌండ్లో ప్రదర్శన కోసం సుమారు 150 మంది విద్యార్థుల దగ్గర ఒక్కొక్క విద్యార్ధి దగ్గర నుండి 400 రూపాయలు వసూలు చేశారనీ తెలిపారు. ఏవైనా పండగల పేరుతో సెలవులు వచ్చినప్పుడు ఇంటికి వెళ్లి లేటుగా వచ్చినందుకు గాను రోజులను బట్టి ఒకరోజు లేటు వస్తే 100, రెండు రోజులైతే 200, మూడు రోజులయితే 300, ఇలా 500 వరకు రకరకాల పేర్లతో ఫైన్లను వసూలు చేయడం జరిగిందన్నారు.

చెకుముకి అనే పరీక్ష కోసం ఒక్కొక్క విద్యార్థిని దగ్గర 500 రూపాయల చొప్పున వసూలు చేశారనీ గుర్తుచేశారు.
ఎవరైనా విద్యార్థులు ఈ విషయాలను బయటకు చెబితే, విచారణకు వచ్చిన అధికారులతో మాట్లాడినా వారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ, వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి అడ్మిషన్ క్యాన్సల్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారనీ అన్నారు.


ఇప్పటికైనా కంజర గురుకులంలో జరుగుతున్న పీఎంశ్రీ పథకం నిధుల దుర్వినియోగం, మెస్ బిల్లులు, మెయింటెనెన్స్ బిల్లుల నిధుల దుర్వినియోగం మరియు విద్యార్థుల నుండి అక్రమ వసూళ్లపై సమగ్ర దర్యాప్తు జరపాలని, ఈ అక్రమ వసూళ్లను వెంటనే ఆపివేయాలని, దుర్వినియోగమైన నిధులను వెంటనే రికవరీ చేయాలని, ప్రిన్సిపాల్ విజయలలిత గారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో PDSU జిల్లా ఉపాధ్యక్షులు జి. నితిన్, జిల్లా నాయకులు ఏం. మున్నా, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!