HomeTelanganaNizamabadఅధికార పార్టీలో చిచ్చు రేపిన .......ఇద్దరి కార్యకర్త ల మధ్య తగాదా ....... అయిదు గంటల...

అధికార పార్టీలో చిచ్చు రేపిన …….ఇద్దరి కార్యకర్త ల మధ్య తగాదా ……. అయిదు గంటల దాక స్టేషన్ లో నేతల పడిగాపులు …………..నామినేటెడ్ పదవి ని వదులు కోవడానికే సిద్ధం అయిన నేత …………..ఫలించిన కేశ వేణు మంత్రాంగం

ఇద్దరు కార్యకర్తల మధ్య మాట మాట పెరిగి చివరికి అది గాలి వానల మారి అధికార పార్టీలో ప్రకంపనలు రేపింది. ఇద్దరి కార్యకర్తల మధ్య పంచాయితీ లో ముఖ్యనేతలు రంగంలోకి దిగి అయిదు గంటలు పోలీస్టేషన్ లో పడి గాపులు పడాల్సి వచ్చింది. అధికార పార్టీ నేతల పోరు పోలీస్ అధికారులు సైతం వణికి పోయారు.

మొత్తానికి ఓ అగ్ర నేత శాంతించడంతో వివాదం సమిసి పోయింది నేతలు పోలీసులు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు.అధికార పార్టీలో అలజడి రేపిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

జిల్లా కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత పదవుల పక్రియ మొదలైంది.పార్టీపదవులు ఎవరెవరికి ఇవ్వాలనేది ఖరారు చేయడానికి పీసీసీ ముగ్గురు ఇంచార్జ్ లను జిల్లాకు పంపింది వారు గత వారం రోజులుగా ఇక్కడే మకాం వేసి పార్టీ పదవులు ఆశిస్తున్నా కార్యకర్తల తో రోజు భేటీ అవుతున్నారు ముఖాముఖీ జరుపుతున్నారు.

నిజామాబాద్ నగర పార్టీలో పదవుల కోసం పోటీ ఎక్కువగా ఉంది. కార్పొరేటర్ టికెట్ కన్న పార్టీ పదవుల కోసమే పట్టుబడుతున్నారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ భవన్ కు ఇంచార్జ్ లను కలవడానికి వచ్చిన ఇద్దరు కార్యకర్తలమధ్య మాట మాట మొదలయ్యింది.

జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సన్నిహితుడైన అంతి రాజిరెడ్డి తనయుడు విజయ్ పాల్ రెడ్డి సైతం నగర కాంగ్రెస్ లో కీలక పదవి కోసం పోటీ పడుతున్నారు.

పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ సన్నిహితుడైన ఆకుల మహేందర్ సైతం పదవీ పట్టుపడుతున్నారు ఈ ఇద్దరి మధ్య కాంగ్రెస్ భవన్ సమీపంలోనే మాట మాట జరిగింది. ఈ క్రమంలోని మహేందర్ మనస్తాపం చెందారు.

దీనితో ఆయన నేరుగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కు పిర్యాదు చేసారు. అంతటి తో ఆగకుండా నేరుగా ఒకటో టౌన్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. తనకు విజయ్ పాల్ నుంచి ప్రాణ హానీ ఉందని పిర్యాదు లో పేర్కొన్నారు.

కార్యకర్త ల మధ్య ఎదో చిన్న గొడవ అనుకొని పోలీసులు మొదట లైట్ తీసుకున్నారు. కానీ అర గంట లో సిన్ మారిపోయింది. ఈ వ్యవహారంను చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పోలీస్ ఉన్నతాధికారులను కోరారు.

అంతే వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు రాజిరెడ్డి తనయుడు విజయ్ పాల్ ను అదుపులోకి తీసుకోని ఒకటో టౌన్ తెచ్చారు. దీనితో ఒక్కసారిగా కంగు తిన్న రాజిరెడ్డి నుడా అధ్యక్షుడు కేశవేణు, తాహెర్ ,మానాల మోహన్ రెడ్డి ల దృష్టి కి తెచ్చారు.

వారంతా అధికారులకు మాట్లాడినా వారు లైట్ తీసుకున్నారు. చివరికి విషయం మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి దాక వెళ్ళింది. అయినా విజయ్ ను కనీసం జామీన్ మీద వదలడానికి పోలీసులు ససేమిరా అన్నారు.

ఓ దశలో గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ పదవి కి రాజీనామా చేసి పార్టీ వీడుతానని రాజిరెడ్డి తెగేసి చెప్పడంతో సుదర్శన్ రెడ్డి ఒత్తిడి తో కేశ వేణు పీసీసీ చీఫ్ మహేష్ ను ప్రాధేయ పడ్డారు. నాలుగు గంటల పాటు వీరంతా ఒకటో టౌన్ స్టేషన్ లోనే ఉన్నారు.

చివరికి కేశ వేణు ఒత్తిడి తో మహేష్ గౌడ్ శాంతించారు. దీనితో విజయ్ పాల్ ను జామీన్ మీద పంపారు. చివరికి ఇద్దరి మధ్య రాజి చేసి సోమవారం కేసులు వెనక్కి తీసుకోవడంతో వివాదం కు తెరపడింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments