HomeCRIMEయాక్సిడెంట్ చేసి భర్త ను హత్య చేసిన భార్య .....ప్రియుడితో కలిసి ఘాతుకం

యాక్సిడెంట్ చేసి భర్త ను హత్య చేసిన భార్య …..ప్రియుడితో కలిసి ఘాతుకం

వివాహేతర సంబంధకు అడ్డుస్తున్నారనే నేపం తోకట్టుకున్న భర్త నే యాక్సిడెంట్ చేయించి కడ తెర్చింది. మృతుడి సంబంధీకులు అనుమానాలు వ్యక్తం చేయడంతో రంగంలోకి దిగి పోలీసులు విచారణ చేశారు.

ఆత్మకూర్ (ఎం) మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన వస్తుపుల స్వామి (36) ట్రాక్టర్ షోరూమ్ మేనేజర్ పనిచేస్తున్నాడు తన స్నేహితుడు మద్దికుంట వీర బాబు ఆదివారం అర్ధరాత్రి భువనగిరి మండలం రాయిగిరి నుంచి స్వగ్రామానికి బైక్ పై వెళ్తుండగా..

మోటకొండూర్ మండలం కాటేపల్లి గ్రామ సమీపంలోని బ్రిడ్జి వద్దకు రాగానే వెనుక నుండి వస్తున్న కారు బైక్ ను ఢీకొట్టింది.ఈ ఘటనలో బైకు ను కారు కొద్దిదూరం లాకెళ్లడంతో స్వామి అక్కడికక్కడే మృతిచెందాడు.

బైక్ వెనుక కూర్చున్న వీర బాబుకు తీవ్ర గాయాలయ్యాయి. స్వామి మృతదేహాన్ని, గాయపడిన వీరబాబును స్థానికులు భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

వీరబాబును మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటన మీద అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు భార్య ను అదుపులోకి తీసుకోని విచారించడంతో పథకం ప్రకారం తానే భర్త ను తమ్ముడు తో కలిసి సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లుగా వెల్లడించింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments