నిబంధనలు పాటించిన వారికి అధికారుల సత్కారం..పాల్గొన్న ఏసీపీ మస్తాన్ వలి, ఎంవీఐ కిరణ్ కుమార్రహదారి నిబంధనల పట్ల అవగాహన కలిగి ఉండటం ప్రాణ రక్షణకు తొలి మెట్టు” అని ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ వలి పేర్కొన్నారు.
రోడ్డు భద్రతా మాసోత్సవంలో భాగంగా శనివారం నగరంలోని ఫులాంగ్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖ సమన్వయంతో వినూత్న అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రహదారి నిబంధనలపై కేవలం జరిమానాలు విధించడమే కాకుండా, వాటిని పాటించేలా ప్రజల్లో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో అధికారులు వినూత్నంగా స్పందించారు.
హెల్మెట్ ధరించి వాహనాలు నడుపుతున్న వారిని ఆపి, వారికి అధికారులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. సీట్‌బెల్ట్ ప్రాముఖ్యతను కారు డ్రైవర్లకు వివరించారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ వలి మాట్లాడుతూ.. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి సురక్షితంగా తిరిగి రావాలని కుటుంబ సభ్యులు ఎదురుచూస్తుంటారని, వారిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని సూచించారు.
ఎంవీఐ కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల్లో మరణాల రేటును తగ్గించడమే ఈ మాసోత్సవాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ ప్రసాద్, 4వ టౌన్ సీఐ సతీష్, ఎస్ఐలు సందీప్, కరీం, మణికంత్, సాగర్, పవన్ కళ్యాణ్, ఏఎంవీఐ వాసుకి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు..
