నిజమాబాద్ నగరంలోని కట్టెల దుకాణంకు భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది వివరాల్లోకి వెళ్లితే.. నగరంలోని వర్ణి చౌరస్తా లో విద్యుత్ ఘాతంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
దీంతో అక్కడే ఉన్న యజమాని ఎంత అర్పిన మంటలు చెలరేగడంతో అగ్ని మాపకశాఖకు సమాచారం అందించారు. హుటాహుటిన అగ్ని మాపక శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొస్తున్నారు.
