పురిటినొప్పులతో బాధపడుతున్న మహిళను హాస్పిటల్‌కు తీసుకెళ్తుండగా అంబులెన్స్‌లోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. 108 వాహన సిబ్బంది ఈఏంటి నవీన్,పైలెట్ మురళి కృష్ణలు ప్రసవం చేశారు.
వివరాల్లోకి వెళ్తే..పోతంగల్ మండలం హెగ్డోలీ కి చెందిన లక్ష్మీ అనే మహిళకు పురిటి నొప్పులు రాగా కుటుంబ సభ్యులు అంబులెన్స్ కు సమాచారం అందించారు.
ఈ మేరకు అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా మార్గ మద్యంలోనే ఎక్కువ కావడంతో పురుడు పోశారు. అనంతరం బోధన్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని వారు తెలిపారు. సకాలంలో స్పందించి కాన్పు చేసిన సిబ్బందిని పలువురు అభినందించారు.
