నగరంలోని తాళం వేసిన ఓ ఇంట్లో భారీ చోరీ చోటు చేసుకుంది.స్థానికుల సమాచారం మేరకు.. సీఎం రోడ్డులో కాలనీ లో ఉంటున్న హమీద్ ఆదివారం షాపింగ్ నిమిత్తం హైదారాబాద్ వెళ్లినట్లు తెలిపారు.
దీంతో గమనించిన దుండగులు ఇంట్లోకి చొరబడి బీరువా నుంచి విలువైన ఆభరణాలు అపహరించినట్లు తెలిపారు.స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం ఆధారంగా వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
