HomeLaw and Orderమరో సారి ఐపిఎస్ ల బదిలీల కోసం కసరత్తులు ......సైబరాబాద్ సీపీ కోసం పోటాపోటీ ........సింగరేణి...

మరో సారి ఐపిఎస్ ల బదిలీల కోసం కసరత్తులు ……సైబరాబాద్ సీపీ కోసం పోటాపోటీ ……..సింగరేణి కి ఐపీఎస్ ?

రాష్ట్రం లో మరోసారి ఐపిఎస్ అధికారులను బదిలీ చెయ్యడానికి ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. జడ్పీ మున్సిపల్ ఎన్నికల లోపు ఈ బదిలీ పక్రియ ను పూర్తీ చెయ్యాలనేది ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యంగా గ్రేటర్ హైదారాబాద్ మున్సిపల్ ఎన్నికల్లోపు సైబరాబాద్ రాచకొండ కమిషనర్ లను బదిలీ చేసే యోచన లో సర్కార్ ఉంది.

ఇందులో రాచకొండ కమిషనర్ విషయంలోనే పునరాలోచన చేస్తుంది.ఆయన త్వరలోనే పదవి విరమణ ఉన్న దృశ్యా అక్కడే కొనసాగించే ఛాన్స్ ఉంది కానీ సైబరాబాద్ సీపీ ని మాత్రం ఖచ్చితంగా బదిలీ చెయ్యడానికి రంగం సిద్ధం అయింది.

అందులోనూ సైబరాబాద్ కమిషనర్ గా అవినాష్ మహంతి సీపీ గా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు కావొస్తుంది అందుకే ఆయన బదిలీ అనివార్యం అయింది.

ఆయను బదిలీ చెయ్యాలని సీఎం మీద ఏడాది కాలంగా సొంత పార్టీ పెద్దలే ఒత్తిడి చేస్తున్నారు కానీ నిక్కచ్చిగా పనిచేస్తుండడంతో సీఎం రేవంత్ సైతం ఇవేవి పట్టించుకోలేదు కానీ రెండేళ్ల పదవి కాలం పూర్తీ అయిన నేపథ్యంలో బదిలీ చెయ్యడానికి సీఎం సానుకూలంగా ఉన్నారు కానీ కొత్త సీపీ గా ఆయన స్థానంలో ఎవరి కి అవకాశం ఇవ్వాలనేది డిజిపి స్థాయిలో నే కసరత్తులు జరుగుతున్నాయి.

ఇందుకోసం మూడు పేర్లు పరిశీలనకు వచ్చాయి ఇందులో తరుణ్ జోషి, రమేష్ రెడ్డి, సుమతి . వీరంతా ఐజి ర్యాంక్ అధికారులు. ఇందులో రమేష్ రెడ్డి తరుణ్ జోష్ వైపు ప్రభుత్వ పెద్దలు మొగ్గు చూపుతున్నారు. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ హోదా పనిచేస్తున్న తరుణ్ జోష్ ని రేవంత్ సర్కార్ రాచకొండ కమిషనర్ గా అర్దాంతరంగా తొలగించింది.

అప్పట్లోనే మంత్రి శ్రీధర్ బాబు అడ్డుకున్నారు రాబోయే రోజుల్లో ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారని ప్రచారం జరిగింది రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు సైబరాబాద్ సీపీ కోసం సీఎం మీద ఒత్తిడి చేస్తున్నారు.

మరో వైపు ప్రభుత్వం ఏర్పాటు అయిన మొదట్లోనే సైబరాబాదు సీపీ గా రమేష్ రెడ్డి పేరు ప్రచారంలోకి వచ్చింది కానీ ఆయనకు ప్రాధాన్యత లేని పోస్టు లో కొనసాగుతూ వస్తున్నారు.అందుకే మరోసారి ఆయన పేరు తెరమీదికి వచ్చింది.

కానీ ఈసారికూడా సైబరాబాద్ సీపీ గా తరుణ్ జోష్ కు పోస్టింగ్ ఇవ్వడం అనివార్యం అయితే రమేష్ రెడ్డి కి కీలకమైన బాధ్యతలు ఇచ్చే ఛాన్స్ ఉంది సింగరేణి సీఎండి గా ఐపిఎస్ ను నియమించే యోచనలో ఉన్న సర్కార్ రమేష్ రెడ్డి వైపు మొగ్గు చూపుతుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments