వేల్పూర్ మండలం అమీనాపూర్ ఎక్స్ రోడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో లక్కోరాకి చెందిన ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. తన టీవీఎస్ ఎక్సెల్ పై వేల్పూర్ వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన ఆటో ఢీకొట్టిందని ఎస్ఐ సంజీవ్ తెలిపారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రమాదానికి గల కారణాలు, మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
