జీవితంపై విరక్తితో వ్యక్తి ఆత్మహత్య…జీవితంపై విరక్తి చెంది ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ నగరంలోని ఒకటో టౌన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. నగరంలోని పోచమ్మ గల్లికి చెందిన కాశీరాం (55). అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తరచూ అనారోగ్యం కారణంగా సోమవారం ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు.
స్థానికుల సమాచారం మేరకు కుటుంబీకులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు .
అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.