గుర్తు తెలియని వాహనం ఢీ కొని వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన నగరంలోని ఆరవ టౌన్ పరిధిలో చోటు చేసుకుంది.ఎస్ఐ మోగులయ్య తెలిపిన వివరాల ప్రకారం.
నిజామాబాద్ నగరంలోని బైపాస్ రోడ్డు పక్కన గుర్తు తెలియని వ్యక్తినీ, వాహనం ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
మృతుని వయస్సు సుమారు 60 సంవత్సరాలు ఉంటుదని తెలిపారు. మృతుని వివరాలు తెలిసిన వారు ఆరవ టౌన్ పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మొగులయ్య తెలిపారు.