HomeCRIMEభారీగా సాగే వసూళ్ల దందా ....ఎవరి వాటాలు ఎంతో ? ..........హైదారాబాద్ దాక...

భారీగా సాగే వసూళ్ల దందా ….ఎవరి వాటాలు ఎంతో ? ……….హైదారాబాద్ దాక పంపకాలు ? ………ఈసారైనా ఏసీబీ నిగ్గు తెలుస్తుందా ? ……..ఏసీబీ దాడి తో వసూళ్ల గుట్టు రట్టు……… ముడుపు చిట్టా తెల్సి అవాక్కయిన ఏసీబీ

ఆయనో సబ్ రిజిస్టార్ అందులోనూ ఆ కుర్చీ లోకి వచ్చిందే ఈమధ్య అయినా ఏళ్ల తరబడిగా ఇక్కడే పాతుక పోయిన అధికారి లాగ బరితెగించి సాగించిన వసూళ్ల దందా వెనుక అసలు గుట్టు రట్టు ఏసీబీ ఈసారైనా రట్టు చేస్తుంది జస్ట్ ఇదే కేసు తో సర్దేస్తుందా అనేది సర్వత్రా ఆసక్తిగా మారింది.

సదురు సబ్ రిజిస్టార్ సాగించే వసూళ్ల దందా లో ఎవరి వాటా ఎంత అనేది తేల్చితేనే ఉన్నతాధికారుల వసూళ్ల లోగుట్టు కూడా రట్టు అవుతుంది. సబ్ రిజిస్టార్ స్థాయి అధికారే ఒక్కడే రోజు అంత మొత్తం వసూలు చేస్తుంటే ఉన్నతాధికారులు మౌనంగా ఎలా వుంటారనేది చర్చనీయాంశంగా మారింది.

తమ వాటా రాకుంటే సదురు అధికారి మీద చిన్న పిర్యాదు వచ్చిన విచారణ పేరుతొ రాచి రంపాన పెడుతారుకదా! మరి శ్రీ రామరాజు మీద పిర్యాదు లు వెల్లువెత్తాయి వాటిని ఉన్నతాధికారులు బుట్టదాఖలు చేయడం వెనుక ఆంతర్యం ఏసీబీ అరా తీస్తోంది.

రోజు కనీసం 45 నుంచి 50 డాక్యమెంట్ క్లియర్ అయ్యే నిజామాబాదు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఒక్కో డాక్యుమెంట్ కు పది వేలరూపాయలు వసూలు చేస్తున్నారంటే రోజు కనీసం నాలుగు లక్షల రూపాయలు ముడుపుల రూపేణా సబ్ రిజిస్టార్ జేబు కు చేరుతుంది. ఈ మొత్తంలో ఎవరెవరి వాటా ఎంత అనేది బయటికి పొక్కడం లేదు.

ఇదే కార్యాలయంలో మరో రిజిస్టార్ తో పాటు ఉద్యోగులలతో పాటు ప్రైవేట్ వ్యక్తులు ఇద్దరున్నారు వీరికి నయానో భయానో ముడుతాయి. ఒక్కో రోజు ఎన్ని డాక్యుమెంట్ లు క్లియర్ అవుతున్నాయనేది ఆన్ లైన్ లో నమోదు అవుతాయి.

ఉన్నతస్థాయిలో అధికారులకు ఆ లెక్క పక్కగా వుంటుంది.రోజువారీగా చేస్తున్న వసూళ్ల నుంచి రోజూవారీగానే ఫై వాటాల పంపకాలు జరుగుతాయనేది అందరికి తెల్సిందే. వసూలు చేస్తున్న మొత్తం లో ఎవరెవరికి ఎంత ముట్ట జెప్తారనేది ? సోమవారం లంచం తీసుకుంటూ పట్టుబడ్డ శ్రీ రామరాజు ను ఏసీబీ విచారిస్తే అసలు మామూళ్ల గుట్టు రట్టు అవుతుంది.

ఏసీబీ కేసుల్లో నిందితులకు కస్టడీ విచారణకు కోర్టు లు సైతం సులువుగా అనుమతి ఇస్తాయి? కానీ శ్రీ రామరాజు ను విచారణ కోరుతూ ఏసీబీ కస్టడీ పిటిషన్ వేయబోతుందా లేదా అనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే అధికార పార్టీ నుంచి తీవ్రమైన ఒత్తిడి వుంటే ఏసీబీ ఇలాంటి పిటిషన్ వేయడానికి ఆసక్తి చూపదు.

ఇటీవల మున్సిపల్ రెవెన్యూ అధికారి విషయంలో కస్టడీ కోరింది మూడురోజులు విచారణ చేసి కీలక విషయాలు అరా తీసింది. శ్రీరామరాజు రోజువారీగా సాగిస్తున్న వసూళ్ల దందా వెనుక ఇంకా ఎవరెవరున్నారనేది తేల్చితేనే రాబోయే రోజుల్లో ఈ కేసు మరింత గట్టిగా నిలబడుతుంది.

ఎవ్వరికి వాటాలు ఇవ్వకుండా ఒక్క అధికారి అంత భారీ మొత్తాల్లో వసూలు చేసుకొని విధులు సాగించడం దుస్సాధ్యంగా చెప్తున్నారు.మామూళ్ల మైకం లో పడిన ఉన్నతాధికారులు రిజిస్ట్రేషన్ కోసం సామాన్యులను సైతం కాసుల కోసం పీక్కుతింటున్న సరే సైలెంట్ గా ఉండడం అలవర్చుకున్నారు.

ఇటీవల ఒక వ్యక్తి ఆస్తి కొనుగోలు లో 60 లక్షల రూపాయలు రిజిస్ట్రేషన్ శాఖ కు చెల్లించాడు. కానీ డాక్యుమెంట్ క్లియర్ చేయడానికి తన వాటాగా 6 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో సదురు వ్యక్తి అంత మొత్తం ఇవ్వడానికి ససేమిరా అన్నాడు అంతే కొర్రీలు వేసి ఫైల్ పక్కకు పెట్టేసాడు విషయం ఫై స్థాయి అధికారి వద్దకు వెళ్ళింది.

అయినా నో యాక్షన్ ! చివరికి ఉన్నతస్థాయిలో లాబీయింగ్ చేయడంతో ఆ డాక్యుమెంట్ క్లియర్ అయింది. మరో ఆసిస్ మెంట్ ఇంజనీర్ విషయంలోనూ ఇదే జరిగింది. సబ్ రిజిస్టార్ ముడుపు ల విషయం పిర్యాదు చేస్తే ఎహే ఇందులో ఆయనేమి తప్పులేదు అంటూ ఉన్నతాధికారి సర్ది చెప్పి నట్లు సమాచారం.

అన్ని సవ్యంగా వుంటే ఒక్కో డాక్యుమెంట్ కు రెండు వేల రూపాయలు ఇవ్వడం ఆనవాయితీ ఉన్నదే కానీ కొత్తగా వచ్చిన శ్రీరామరాజు మామూళ్ల వసూళ్ల ల్లో కొత్త ట్రెండ్ కు తెరలేపారు.ఒక్కో డాక్యుమెంట్ పది వేలు పిక్స్ చేశారు అదే ఆయన వసూళ్ల దందా ఏసీబీ దాక తీసుకెళ్లింది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments