HomeLaw and Orderకోడ్ కోసం కొత్త కొత్వాల్ ఎదురు చూపులు .....మండలి ఎన్నికల కోడ్ ఎత్తివేసాకే కమిషనర్ నియామకం...

కోడ్ కోసం కొత్త కొత్వాల్ ఎదురు చూపులు …..మండలి ఎన్నికల కోడ్ ఎత్తివేసాకే కమిషనర్ నియామకం …….గట్టి కమిషనర్ రాబోతున్నాడంటూ హింట్ ……సిద్ధం అయినా ఫైల్

నిజామాబాద్ కొత్త కమిషనర్ నియామకం లో సాగుతున్న అసాధారణ జాప్యం కు తెరపడబోతుంది.అవునూ! ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే కమిషనర్ నియామక ఉత్తర్వ్యూలు వచ్చే అవకాశం ఉంది .

ఈపాటికే కొత్త కమిషనర్ నియామకం కసరత్తులు పూర్తీ చేసారు.అధికార పార్టీలో కీలక నేత సైతం ఇందుకు సంబంధించి సంకేతాలు కూడా ఇచ్చేసారు.ఎమ్మెల్సీ ఎన్నికల వోట్ల లెక్కింపు పక్రియ రేపటి తో పూర్తీ కాబోతుంది. వారం రోజుల్లో ఎన్నికల కోడ్ తొలిగి పోతుంది.

రెండు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. జిల్లాఎన్నికల చరిత్ర లోనే మొదటి సారిగా జిల్లాకు పోలీసు బాస్ లేకుండానే ఎన్నికల కతృవు జరిగింది. నిజామాబాద్ పోలీసు కమిషనర్ గా ఉన్న కల్మేశ్వర్ గత ఏడాది అక్టోబర్ లో బదిలీ అయ్యారు.

ఆయన పనితీరు ప్రభుత్వ పెద్దలకు ఎంతో నచ్చింది అయినప్పటికీ ఆయన డిప్యుటేషన్ మీద కేంద్ర సర్వీస్ లో కి వెళ్లడంతో ఆయన ను రిలీవ్ చేయడం అనివార్యం అయింది. కానీ కల్మేశ్వర్ స్థానం లో కొత్త కమిషనర్ నియామకం లో ప్రభుత్వం తాత్సారం చేసింది.

అనేక మంది పేర్లు పరిశీలన చేసి చివరికి పెండింగ్ లో పెట్టి కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ కు ఇంచార్జ్ కమిషనర్ గా బాధ్యతలు ఇచ్చింది. కానీ అధికార పార్టీలోనే ఇద్దరు దిగ్గజ నేతలమధ్య ఆధిపత్య పోరు నేపథ్యంలోనే కమిషనర్ నియామకం విషయంలో ప్రభుత్వం ఎటు తేల్చలేక పోయింది.

ఓ నేత నాన్ క్యాడర్ ఐపిఎస్ కావాలంటూ ఏకంగా ఇద్దరి పేర్లను సిఫారస్ చేస్తే మరో దిగ్గజ నేత మాత్రం జిల్లాలో గట్టిగా పనిచేసే డైరెక్ట్ ఐపిఎస్ నే కమిషనర్ గా పోస్టింగ్ ఇవ్వాలని పట్టు బడుతున్నారు. అందువల్లే సీఎం సైతం ఈ విషయంలో ఇరకాటంలో పడ్డారని అధికార పార్టీలో నేతల్లో ప్రచారం జరుగుతుంది.

మరో వైపు అధికార పార్టీ నేతల ఆధిపత్య పోరులో నలిగి పోతామనే భయంతో ఒకరిద్దరు అధికారులు నిజామాబాద్ కమిషనర్ పోస్టింగ్ అంటేనే ససేమిరా అంటున్నారు. కానీ నెలలు గడుస్తున్నా సరే ప్రభుత్వం కమిషనర్ నియామకం లో మీన మేషాలే లెక్కిస్తూ వచ్చింది. అసలు జిల్లాకు మంత్రి పదవీ దక్కే దాక కమిషనర్ పోస్టింగ్ కాదనే చర్చ సాగింది.

మర్చి మొదటి వారంలోనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించడానికి సిద్ధం అయినా ప్రభుత్వం జనవరి లో నే కమిషనర్ నియామకం చేస్తోంది భావించారు కానీ ఆ ఎన్నికల పక్రియ వెనక్కి వెళ్ళింది కానీ కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించడంతో కమిషనర్ నియామకం పెండింగ్ లో పడింది.

ఓ దశలో సిరిసిల్లా ఎస్పీ ని కమిష్నర్ గా నియమించడానికి ప్రభుత్వం సిద్ధం అయింది కానీ ఎన్నికల కమిషన్ మూడు పేర్ల తో ప్రతిపాదనలు పంపాలని సూచించింది.దీనితో సర్కార్ వెనక్కి తగ్గింది.ఎమ్మెల్సీ ఎన్నికల పక్రియ లో చివరి అంకం పోలింగ్ రేపటి తో పూర్తీ అవుతుంది మరో మూడు రోజుల్లో కోడ్ ఎత్తివేస్తారు. కోడ్ ఎత్తేసిన వెంటనే కొత్త కమిషనర్ నియామకం కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుంది.

కొత్త కమిషనర్ గా గట్టిగా ఆఫీసర్ రాబోతున్నాడంటూ మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి రెండు రోజుల క్రితమే సన్నిహితులకు సంకేతాలు ఇచ్చారు.

కానీ ఎవరు కమిషనర్ గా రాబోతున్నారనే విషయంలో భిన్నమైన వాదనలు ప్రచారంలోకి వస్తున్నాయ్ కానీ డైరెక్ట్ ఐపిఎస్ నే కమిషనర్ గా వేయాలనే సుదర్శన్ రెడ్డి పట్టుబడుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments